1894వ సంవత్సరం లో నిర్మించబడిన సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి, డల్హౌసీ లోని చూడవలసిన పర్యాటక ప్రాంతాలలో ఒకటి. ఈ భవన నిర్మాణం సుప్రసిద్ధ "ఇంగ్లాండ్ చర్చి" కి అనుకరణగా ఉంటుంది. ఈ చర్చి నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి, సైనిక అధికారులు మరియు ఈ ప్రాంత పౌరులు విరాళంగా ఇచ్చారు. చర్చి యొక్క నిర్వహణ జలంధర్ కాథలిక్ అధికారపరిధి లో ఉంది. ఆధునిక గాజు పని తో మరియు రాళ్లు పొదిగిన గోడలతో ఉన్న చర్చి అలంకరణ, దాని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ప్రతి ఆదివారం నిర్వహించబడే ఆరాధన సభకు పెద్ద సంఖ్య లో జనం హాజరవుతారు. ఈ చర్చి డల్హౌసీ నుండి 1 కి.మీ దూరంలో ఉన్న సుభాష్ చౌక్ సమీపంలో ఉంది. యాత్రికులు బస్సులు లేదా టాక్సీల ద్వారా లేదా కాలినడకన చర్చిని చేరుకోవచ్చు. చర్చి యొక్క పూర్తి పర్యటనకు కనీసం ఒక గంట సమయం పడుతుంది. సెయింట్ ఆండ్రూస్ చర్చి మరియు సుభాష్ బోలి, ఈ ప్రదేశానికి సమీపంలోని ఆకర్షణలు.