సముద్ర మట్టానికి 2085 మీటర్ల ఎత్తులో ఉన్న ఎగువ బక్రోట డల్హౌసీ లోని ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. పర్యాటకులు ఇక్కడి ప్రకృతి సౌందర్యం గమనించడానికి, ఈ ప్రాంతాన్నికాలినడకన సందర్శించాలని సూచిస్తారు. బక్రోట వ్యాహ్యాళి లో ఒక భాగం గా ఉన్న దీన్ని ఒక రోజు నడకగా వర్గీకరించారు.ఇది ఖజ్జియర్ మార్గంలో ఉండి, అలా నీటి ట్యాంక్ వరకు కొనసాగుతుంది.