Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » జామా మసీదు

జామా మసీదు, ఢిల్లీ

7

జామా మసీదు భారతదెశం లోని పురాతన మశీదులలో ఒకటి. దీనిని షాజహాను నిర్మించాడు. ఇది  ఆ మొఘలు చక్రవర్తి చే నిర్మించ బడ్డ ఆఖరి వాస్తు నిర్మాణం. దీనిని 1650 లో మొదలుపెట్టి ఆరు సంవత్సరాల తరువాత అనగా 1656 లో పూర్తిచేసారు. చౌడీ బజార్ లో గల ఈ మసీదు పాత ఢిల్లీ లో గల దర్శనీయ స్థలాలలో ముఖ్యమైనది.

ఈ మశీదు ని మొదట "మస్జిద్-ఈ-జహాన్-నుమా" అని పిలిచేవారు. "మస్జిద్-ఈ-జహాన్-నుమా" అనగా మశీదు ని ప్రతిబింబించే ప్రపంచం అని అర్ధంట. తరువాత  ముస్లిం మతస్తుల మధ్యాహ్న ప్రార్ధనలైన "జామా" పేరు మీద ఇది  "జామా మశీదు" గా మారింది.

ఒకేసారి పాతికవేలమంది కూర్చుని ప్రార్ధించే స్థలం ఉంది ఈ మశీదులో. ఈ మశీదు కి మూడు ద్వారాలు,40 మీటర్ల ఎత్తుతో తెల్ల పాలరాయి మరియు ఎర్ర ఇసుకరాయితో చేసిన  నాలుగు స్తంభాలు గల   టవర్లున్నయి. ఇంకా హిందూ జైన వాస్తు  శాస్త్ర ఆధారం గా అత్యద్భుతం గా చెక్కబడిన 260 స్తంభాలున్నయి.

ఈ మశీదు నేల తెలుపు మరియు నలుపు మార్బుల్ తో ముస్లిం  మతస్తులు కూర్చుని  ప్రార్ధించే  వస్త్రాన్ని పోలి ఉంటుంది.  ఐదడుగుల ప్లాట్ఫారం మీద నిలిచి ఉన్న ఈ అందమైన మశీదు భారత దేశ మసీదులలోకెల్ల పెద్దది.

ఈ మశీదులో అనేక ప్రాచీన చిహ్నాలున్నాయి. వాటిలో జింక చర్మం మీద రాయబడ్డ పురాతన పవిత్ర ఖురాను ప్రతి ముఖ్యమైనది. ఈ  మశీదు ఉత్తర ద్వారం  వద్ద అమర్చబడింది. జామా మశీదు ఎర్ర కోట కి ఎదురుగా ఉన్నది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed