Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » కుతుబ్ భవనసముదాయం

కుతుబ్ భవనసముదాయం, ఢిల్లీ

7

ఢిల్లీ లోని మెహ్రౌలీ ప్రాంతం లో ఉన్న ఈ కుతుబ్ భవనసముదాయం సుప్రసిద్ధ ఆకర్షణ కుతుబ్ మినార్ మరియు మరెన్నో ఇతర ప్రామాణిక చారిత్రక స్మారకాలకి నిలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ( వరల్డ్ హెరిటేజ్ సైట్) గా ప్రకటించబడిన ఈ ప్రాంతం లో అనేక బానిస రాజవంశానికి చెందిన కట్టడాలు ఉన్నాయి. చాలా చక్కగా నిర్వహించబడుతున్న ఈ ప్రదేశం, ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ మరియు ఢిల్లీ లోని ఒక మంచి విహార ప్రదేశం. ఇక్కడి ఆసక్తికరమైన స్మారకాల జాబితా -

కుతుబ్ మినార్: ఇది సముదాయంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన నిర్మాణం.72.5 మీటర్ల తో ఇది దేశంలోనే అతి పొడవైన మసీదు శిఖరం.కుతుబ్-ఉద్-దిన్-ఐబక్ చే 1193 మరియు 1368 మధ్యలో విజయ గోపురం గా నిర్మించబడింది.చాలా చక్కగా నిర్వహించబడుతున్న ఈ కట్టడం ఒక నిర్మాణ అద్భుతం. భారత దేశం లోనే తప్పక చూడవలసిన కట్టడం.

ఇనుప స్థంభం: మీరు భారత దేశం లోని తుప్పు పట్టని ఇనుప స్థంభం గురించి విని ఉంటే,అది ఈ సముదాయం లోనిదే.చంద్ర గుప్త II విక్రమాదిత్య చేత క్రీ.శ 400 లలో నిర్మించబడ్డ ఈ స్థంభం ఎత్తు ఏడు మీటర్లు. దీని కోసం ఉపయోగించిన తుప్పు రహిత లోహ మిశ్రమం ఢిల్లీ యొక్క కఠినమైన వాతావరణ పరిస్థితులని తట్టుకుంటూ బలంగా నిలబడి ఈ నాటి లోహశాస్త్రజ్ఞులని సైతం ఆశ్చర్యచకితులని చేస్తున్నది.

అలా-ఇ-మినార్: కుతుబ్ మినార్ కి రెట్టింపు ఎత్తు లో కట్టమని అలా-ఉద్-దిన్-ఖిల్జీ చేత పురమాయించబడిన ఈ గోపురం, అతని మరణంతో 25.4 మీటర్ల వద్దే ఆగిపోయింది.ఈ అసంపూర్ణ అలా-ఇ-మినార్ కూడా ఇదే ప్రాంగణం లో ఉంది.

అలా-ఇ-దర్వాజా: సముదాయంలోని గల కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు కి ప్రవేశ మార్గం గా ఉపయోగించబడిన గుమ్మటం గల చిన్న చతురస్రాకార భవనం అలా-ఇ-దర్వాజా.అందమైన చెక్కిన శిలా తెరలతో,పాలరాయి అలంకరణల తో అలరారుతున్నఈ కట్టడం ఇప్పుడు కుతుబ్ మినార్ కి వెనక భాగం లో ఉంది.

కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు: ప్రాంగణం లోపలి ఈ మసీదు ఢిల్లీ లోని అతి ప్రాచీన మసీదుల్లో ఒకటి. చాలా వరకు శిథిలమైపోయినప్పటికీ, కట్టడం లోని కొన్ని భాగాలు సంక్లిష్టంగా , అందమైన అలంకరణలు, చెక్కడాలతో రమ్యంగా ఉంటుంది.

ఇమాం జామిన్ సమాధి: సికందర్ లోడి పరిపాలనా కాలంలో కుతుబ్ ప్రాంగణంలో గల ఈ మసీదు లో నివసించిన టర్కీ దేశస్థునికి ఈ సమాధి అంకితం చేయబడినది. అలా-ఇ-దర్వాజా పక్కనే ఇది ఉంది.

అలా-ఉద్-దిన్-ఖిల్జీ సమాధి మరియు మదరసా:ఖిల్జీ రాజ వంశ పరిపాలకుడు అలా-ఉద్-దిన్-ఖిల్జీ యొక్క సమాధి మరియు అతని చే నిర్మించబడిన మదరసా ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి. క్రీ.శ 1296 నుంచి 1316 కాలం మధ్య ఈ ప్రాంతం నుంచి పరిపాలించిన ఈ చక్రవర్తి ఢిల్లీ కి రెండవ సుల్తాన్.

ఇల్తుమిష్ సమాధి: బానిస రాజవంశ పరిపాలకుడు అయిన ఇల్తుమిష్ సమాధి కూడా ఈ ప్రాంగణం లోనే ఉంది. ఈ స్మారక చిహ్నం పాలరాతితో తయారు చేయబడి గది మధ్య లో ఉన్న ఒక ఎత్తైన వేదిక మీద ఉంది.విస్తారమైన అందమైన చెక్కడాలకి ఇది పేరు గాంచింది.

సుల్తాన్ ఘడి: ఇల్తుమిష్ పెద్ద కొడుకు నసీర్-ఉద్-దీన్ కోసం కట్టబడిన మహమ్మదీయ సమాధి సుల్తాన్ ఘడి. క్రీ.శ. 1231 లో నిర్మించబడిన ఇది బానిస రాజవంశం కాలం నాటి మధ్యయుగ ఢిల్లీ లో భాగం. అయితే, ఇప్పుడు ఇది కుతుబ్ ప్రాంగణంలోని భాగం.అసాధారణమైన ఆకృతితో చావళ్ళతో కోటని తలపించే ఈ ప్రదేశం, హిందూ ముస్లిం భక్తుల చే ఒక సమాధి గా మాత్రమే పరిగణించబడక ఒక పవిత్ర దర్గా వలే పూజలు అందుకుంటుంది. ఆ విధంగా,ఈ పురాతన కట్టడం,భారతదేశ పురావస్తు శాఖ వల్ల గాక ముఖ్యంగా భక్తుల రాక వల్ల చక్కని నిర్వహణ కు నోచుకున్నది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu