Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » ఢిల్లీ షాపింగ్

ఢిల్లీ షాపింగ్, ఢిల్లీ

20

ఢిల్లీ లో షాపింగ్ చేయటం ఒక సంతోషకరమైన అనుభవం. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుండి ఫుట్ పాత్ దుకాణాలలో కూడా మనకు కావలసిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. రండి, డిల్లీలో ఎక్కడెక్కడ మీకు కావలసిన వస్తువులు కొనుగోలు చేయవచ్చో త్వరగా చూద్దాం.

జనపథ్ఎవరైతే షాపింగ్ చేయటం ఇష్టపడతారో, వారికి ప్రత్యేకంగా డిల్లీ 'కొనుగోలుదారుడి స్వర్గం' గురించి చెప్పనక్కరలేదు. అయినప్పటికీ, మీకు నచ్చిన వస్తువులు ఎక్కడెక్కడ దొరుకుతాయో, కొనుగోలు చేయవొచ్చో ఆ ప్రదేశాలను పరిచయం చేస్తాము. అలా పేరు మోసిన ప్రదేశాలలో జనపథ్ బజార్ ఒకటి. మీరు నాగరికమైన దుస్తులు, వృథా వస్తువులతో తయారుచేసిన నగలు, నాణ్యమైన రాళ్ళతో తయారైన కృత్రిమ మరియు వెండి నగలు, గృహాలంకరణ వస్తువులు, హస్తకళాకృతులు, ఉత్కంఠ కలిగించే పుస్తకాలు మరియు ఇంకా వేరేవి కొనుగోలు చేయలన్నాఈ ప్రదేశాన్ని చూడవొచ్చు. ఇక్కడ టిబెట్ శరణార్ధులను కూడా చూడవొచ్చు. నకిలీ వస్తువులు మరియు ఉత్పత్తుల పట్ల జాగ్రత్త వహించండి లేకపోతే విక్రేతలు వాటిని బలవంతంగా అంటగడతారు.

టిబెటన్ విఫణి: ఇక్కడ టిబెటన్ కళాఖండాలు, అలంకరణ ఇత్తడి వస్తువులను, వెండి పరికరాలు, సంగీత సాధన పరికరాలు మరియు గోడ అలంకరణలు ఇంకా ఎన్నెన్నో అమ్ముతారు.

చోర్ బజార్: దీన్నే 'దొంగ బజార్' అని కూడా పిలుస్తారు;ఎర్ర కోటకు దగ్గరగా ఉన్నది మరియు మరో మార్కెట్ 'లజపత్ రాయ్ విఫణి'; ఇక్కడ తక్కువ ధరలో ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుండి డిజైనర్ దుస్తుల వరకు దొరుకుతాయని ప్రసిద్ధి.

దర్యాగంజ్ పుస్తక విఫణి: పుస్తకాలంటే ప్రేమా? అయితే మీరు తప్పనిసరిగా డిల్లీలో దర్యాగంజ్ కు వెళ్ళవలసిందే. ఇది శాహ్జహనాబాద్ దగ్గర ఉన్నది లేకపోతే పాత డిల్లీలో ప్రతి ఆదివారం వ్యాపార కూడలిలో కితాబ్ బజార్ (పుస్తక విఫణి) జరుగుతుంది. ఇది పుస్తకాలకు చాల ప్రసిద్ధి.

ఖాన్ విఫణి: మీరు డిల్లీలో ఉన్నప్పుడు, చాలా విలాసవంతంగా ఖర్చు చేయాలి అనుకున్నప్పుడు, ఖాన్ మార్కెట్కు వెళ్ళవలసిందే. ఇది భారత ఉపఖండంలోనే ఖరీదైన రిటైల్ షాపింగ్ స్థలం. 1951 లో స్థాపించబడింది మరియు దీనికి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పెట్టారు - ఫ్రాంటియర్ మహాత్మా గాంధీగా పేరు పొందిన ఒక మంచి రాజకీయ నాయకుడు. ఇక్కడ రీబాక్ నైక్, టామీ హిల్ఫిగేర్, గుడ్అర్థ్, ఫాబ్ ఇండియా అనే వివిధ ప్రఖ్యాత బ్రాండ్ల యొక్క దుకాణాలు విస్తృతంగా ఉన్నాయి అందువలన ఎప్పుడు జనసందోహంగా, సందడిగా ఉంటుంది. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ కుష్మాన్ & వేక్ఫీల్డ్ 2010వ సంవత్సరంలో ఈ బజారు ప్రపంచంలో 21వ అత్యంత ఖరీదైన రిటైల్ హై స్ట్రీట్ అని చెప్పారు. ఇక్కడ వంట సామగ్రి ,వెండి ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పుస్తకాలు, గృహోపకరణాలు, క్లాసి క్రాకరీస్, లైటింగ్ పరికరాలు, అందమైన దుస్తులు ఇంకా అనేక రకాల వస్తువులు దొరుకుతాయి.

కన్నాట్ ప్లేస్: ఇది CP అని కూడా ప్రజాదరణ పొందింది. ఇక్కడ కొన్ని పాశ్చాత్య ఉత్పత్తులు భారతీయ ధరలకే దొరుకుతాయి. ఇది ఢిల్లీ ప్రధాన మరియు చారిత్రక షాపింగ్ ప్రాంతం. ఈ ప్రాంతాన్నిరాజీవ్ చౌక్ అని కూడా పిలుస్తారు.

పాలిక బజార్ : ఇది CP లో ఉన్న ఒక భూగర్భ విఫణి మరియు ఇక్కడ అనేక రకాల వస్తువులు అమ్మే 390 షాప్స్ ఉన్నాయి. కానీ మీరు ఇక్కడ ఎక్కువగా CD లు, DVD లు, వీడియో గేమ్లు మరియు ఆడియో CD లు సరసమైన ధరలకు కొనుక్కోవొచ్చు.

సాకేత్ యొక్క మాల్స్: ఢిల్లీలో ఉన్న అనేక శ్రేష్టమైన మాల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇది సిటీ వాక్, డిఎల్ఎఫ్ ప్లేస్ మరియు MGF మెట్రోపాలిటన్ వంటి షాపింగ్ మాల్స్ ఉన్న ఒక ప్రముఖ పట్టణ షాపింగ్ ప్రాంతం.

పహర్గంజ్ విఫణి: న్యూ ఢిల్లీ రైల్వే ఎదురుగా ఉన్న ఈ మార్కెట్లో ఉన్న దుకాణాలలో నగలు, పరిమళ ద్రవ్యాలు, షాల్స్, రగ్గులు మరియు తబలా వంటి సంగీత సాధన చేసే పరికరాలు కొనడానికి దొరుకుతాయి.

కమల నగర్: ఇక్కడ పెద్ద బ్రాండ్ కల దుస్తులు కానివ్వండి, పాదరక్షలు లేదా ఏ బ్రాండ్ ఉత్పత్తి లేదా రోడ్డు వైపు విక్రయించే స్థానిక ఉత్పత్తులు కానివ్వండి, ఇక్కడ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇది సంతోషకరమైన షాపింగ్ చేయతగ్గ ఒక సంపూర్ణ స్థానం.

రాజౌరి గార్డెన్ విఫణి: ఈ ఉన్నతస్థాయి మార్కెట్ వివాహ షాపింగ్ మరియు సాధారణ దుస్తులకు పేరుగాంచింది. ఇక్కడ కూడా వివిధ సాంకేతిక ఆధునిక మాల్స్, అనేక ప్రసిద్ధ రెస్టారెంట్లు మరియు సినిమా హాళ్ళు ఉన్నాయి.

సెంట్రల్ మార్కెట్, లజపత్ నగర్: మీరు పాదరక్షలు,సంప్రదాయ దుస్తులు కాని,ఆధునిక దుస్తులు కాని ఏవైనా సరే ఇక్కడ కొనవొచ్చు. ఇక్కడ రోడ్డు పక్కన కూర్చున్నమేహన్దివాలాలతో మీ చేతులకు మెహేందిని కళాత్మకంగా అలంకరిమ్పచేసుకోవొచ్చు.

సరోజినీ మార్కెట్:ఇది ఢిల్లీలో ఉన్నపరిశుభ్రమైన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ మీరు గ్రీన్ పచారీ సరుకులు, పాదరక్షలు మరియు ఎగుమతి మిగులు బట్టలు వంటివి కొనడానికి దొరుకుతాయి. ఈ మార్కెట్ ప్రతి సోమవారం మూసి ఉంటుంది.

కరోల్ బాగ్: ప్రస్తుతము ఇక్కడ వివిధ ప్రధాన పెద్ద బ్రాండ్ల దుకాణములు ఉన్నాయి. ఆర్య సమాజ్ రోడ్, అజ్మల్ ఖాన్ రోడ్ మరియు గఫర్ మార్కెట్ వంటి బాగ్ యొక్క ప్రధాన రహదారులపై ఢిల్లీ యొక్క శ్రేష్టమైన దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ షాల్స్ ,భారతీయ సంప్రదాయ దుస్తులు మరియు మంచి చీరలు దొరుకుతాయి.

చాందిని చౌక్: మీరు ఒక విలక్షణమైన భారతీయ మార్కెట్లో షాపింగ్ అనుభవాన్ని కోరుకుంటే, చాందిని చౌక్ మీకు తగిన ప్రదేశం. ఇక్కడ అనేక ఆసక్తికరమైన అమ్మకాలతో క్రిస్-క్రాస్ గల్లిస్ (చిన్న దారులు) కూడా కొనుగోలు చేయటానికి వొచ్చిన సందర్శకులతో నిండిపోయి ఉంటుంది.రుచికరమైన డిల్లీ చాట్లు వంటి తినుబండారాల అమ్మకాలతో క్రిక్కిరిసి ఉంటుంది.

ఖరి బోలి :ఇక్కడ అన్ని రకాల మసాలాలు దొరుకుతాయి. ఇది పాత డిల్లీలో ఉంది. ఇక్కడ రుచికరమైన మసాలా చాయ్ మిక్స్, ఏలకులు మరియు అన్ని రకాల మాంసాహారం మరియు శాకాహార వంటకాలకు కావలసిన సుగంధ ద్రవ్యాల మసాలాలు టోకు ధరలలో లభిస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu