Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » స్వామి నారాయణ్ అక్షరధాం టెంపుల్

స్వామి నారాయణ్ అక్షరధాం టెంపుల్, ఢిల్లీ

7

ఢిల్లీ లోని స్వామి నారాయణ్ అక్షరధాం టెంపుల్ భారతీయ సంస్కృతి ని, శిల్పశైలిని, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. ఈ టెంపుల్ సముదాయాన్ని 5 సంవత్సారాల పాటు నిర్మించారు. ప్రాముఖ్ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. ఈయన బొచాసన్వాసి శ్రీ అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్తా వారసులు.

అక్షర ధాం దేవాలయ సముదాయం లో సుమారు 11,000 మంది కళాకారులు పనిచేసారు. ఈ కాంప్లెక్స్ ను అధికారికంగా 6 నవంబర్, 2005 నాడు ఆవిష్కరించారు. ఈ టెంపుల్ ను వాస్తు శాస్త్ర మరియు పాంచరాత్ర శాస్త్రా ల మేరకు నిర్మించారు.

 

ఈ దేవాలయ సముదాయాన్ని 5 ప్రధాన భాగాలుగా విభజించారు. టెంపుల్ మధ్య భాగం లో వుంటుంది. 141 అడుగుల ఎత్తు కల ఈ నిర్మాణం 234 స్తంభాలు, 9 దోములు, 20 నలుచదరపు శిఖరాలు, ఒక గజేంద్ర పీటం , 20,000 దేముల్ల, ఋషులు, భక్తులు, మహర్షుల విగ్రహాలను కలిగి వుంటుంది. ఈ కట్టడం లో పింక్ రంగు రాళ్ళని మరియు వైట్ పాలరాతిని ఉపయోగించారు. ఎక్కడా స్టీల్ లేదా కాంక్రీట్ ఉపయోగించలేదు. స్వామినారాయణ్ జీవిత విశేషాలను ప్రదర్శిస్తూ, ఒక పెద్ద హాలు కలదు. ఈ అంశాలు, ప్రతి ఒక్కరికి, ప్రశాంతత , సేవ, భగవంతుడి యందు భక్తి కలిగి ఉండటాన్ని బోధిస్తాయి. ఈ కాంప్లెక్స్ లో నీలకంట్ కళ్యాన్ యాత్ర ఫిలిం ఒకటి ప్రదర్శిస్తారు. దీనిలో ఇండియా లోని వివిధ మత పర ప్రదేశాలు, సంస్కృతి, ఉత్సవాలు, పండుగలు మొదలైనవి చూపుతారు. దీనిని మిస్టిక్ ఇండియా అని పిలుస్తారు. మన సంస్కృతిని ప్రదర్శించే అంశాలను చూస్తూ ఒక బోటు విహారం కూడా చేయవచ్చు.

యజ్ఞపురుష కుండ లోని మ్యూజికల్ ఫౌంటెన్ మరొక ఆకర్షణ. ఇక్కడకల మెట్ల భావి ప్రపంచం లోనే లోతైనది. సాయంకాలాలు మ్యూజికల్ ఫౌంటెన్ ప్రదర్శిస్తారు. మెట్ల భావి మధ్యలో ఒక ఎనిమిది ఆకుల పద్మం వుంటుంది. ఇది ఆనాటి ఇండియా లోని గణిత విజ్ఞానికి నిదర్శనంగా నిలుస్తుంది.

భారత్ ఉపవన్ లేదా గార్డెన్ అఫ్ ఇండియా లో అనేక మంది పిల్లలు, మహిళలు, స్వాతంత్ర పోరాట యోధుల, గొప్ప వ్యక్తుల విగ్రహాలు ఒక వరుసలో ప్రదర్శిస్తారు. ఈ కాంప్లెక్స్ లో ఇంకా యోగి హరిదే కమల్, నీల్కంట్ అభిషేక్, నారాయణ్ సరోవర్, ప్రేమ వతి ఆహార గృహ మరియు ఆర్ష సంస్కృతి వంటివి మరికొన్ని ఆకర్షణలు. ఢిల్లీ లోని ఈ దేవాలయం తప్పక చూడవలసిన ఆకర్షనలలో ఒకటి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed