Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ధన్ బాద్

ధన్ బాద్ – భారతదేశ బొగ్గు రాజధాని!

33

ధన్ బాద్ , ఝార్ఖండ్ లోని పేరుగాంచిన గనుల నగరం. ‘భారతదేశంలోని బొగ్గు రాజధాని’ గా పేరుగాంచిన ఈ ధన్ బాద్ భారతదేశంలోని సంపన్న బొగ్గు గనులకు నిలయం. ఇది పడమరలో బొకారో, గిరిదిహ్ జిల్లాలతో చుట్టబడి ఉంది. తూర్పు, దక్షిణాన పురులియా జిల్లా ఉంటే, ఉత్తరం లో దుమ్క, గిరిదిహ్ సరిహద్దు ఉన్నాయి. ఈ బొగ్గు గనుల ప్రాంతం మొత్తంలో దామోదర్ నది చాలా ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ నగరం గుండా బరాకర్ నది కూడా ప్రవహిస్తుంది. గోబాయి, ఇర్జి, ఖుదియ, కాతరి మొదలైనవి కొన్ని ఇతర చిన్న నదులు కూడా ఉన్నాయి.

వివిధ సాంఘిక సంస్కృతులు, పారిశ్రామిక, విద్య సంస్థలు ధన్ బాద్ ని భారతదేశం మొత్తంలో ప్రసిద్ది పొందేటట్లు చేసాయి. 56454 ఎకరాల విశాలమైన అడవులతో నిర్మించబడ్డ ఈ జిల్లా, 100850 ఎకరాల గుట్టలతో కప్పబడి ఉంది. ఈ ప్రాంతంలో కనుగొనబడ్డ ఎర్ర మట్టి వ్యవసాయానికి అంతగా ఉపయోగపడదు. ఈ ప్రాంతంలో అనేకమంది చేపల పెంపకం, పట్టుపురుగుల పెంపకాన్ని నేర్చుకుంటున్నారు.

ధన్ బాద్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

బొగ్గు గనులు, ధన్బాద్ లో అతిపెద్ద ఆకర్షణ. ఈ జిల్లాలోను, చుట్టుపక్కల ప్రజలకు గనులే ప్రధాన వృత్తి. సంపన్న బొగ్గుగనులు జిల్లాలోని వివిధ బొగ్గు గనుల కింద విడిపోయాయి. పనిచేసే చోట గని కార్మికులను చూడడం ఒక ఉత్తేజకరమైన అనుభవం.

దుర్గామాతకు అంకితం చేయబడిన శక్తి మందిరం ఒక యాత్రాస్థలం. ‘అఖండ జ్యోతి’ వైష్ణో దేవి నుండి ఇక్కడ ఉంచబడుతుంది. దుర్గా, శివ, గణేష్, నంది వంటి అన్వేషి౦చబడ్డ రూపం కోల్పోయిన విగ్రహాలు ఉన్న దాల్మి మరో ధార్మిక ప్రదేశం. బౌద్ధ, జైన అవశేషాలు కూడా దాల్మిలో కనిపిస్తాయి. మైథాన్ డాం ధన్బాద్ లోని గుర్తించదగ్గ పర్యాటక కేంద్రాలలో ఒకటి. బరాకర్ నది పై ఉన్న ఈ మైథాన్ పవర్ స్టేషన్ జలవిద్యుత్తును అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది. తోప్చంచి, తుండి అంతటా జిల్లానుండి ఉత్తరం గుండా పరస్నాథ్ హిల్స్ ఉన్నాయి. చరక్ పథార్, గోలాపూర్, చాటి గోవి౦దపూర్, మేవ, ఝింజిపహరి, చార్క్ ఖుర్డ్, పనర మొదలైనవి ధన్బాద్ లోని ఇతర ఆకర్షణలు. కళ్యానేశ్వరి ఆలయం, తోప్చంచి సరస్సు, భటిండా జలపాతాలు, పంచేట్ డాం వంటి కొన్ని ఇతర ప్రదేశాలు ధన్ బాద్ పర్యటించే ప్రజలు తప్పక చూడవలసినవి.

సెంట్రల్ మైనింగ్ రిసర్చ్ స్టేషన్, సెంట్రల్ ఫ్యూయల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ వంటివి కొన్ని ప్రసిద్ది చెందిన సంస్థలు.

చేరుకోవడం ఎలా

ధన్ బాద్ , వాయు, రైలు, రోడ్డు మార్గం ద్వారా సులువుగా అందుబాటులో ఉంది. కోల్కతా, పాట్న వంటి ప్రధాన నగరాలు రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. ఈ నగరంలోపల ప్రయాణించడానికి టాక్సీలు, స్కూటర్లు, సైకిల్ రిక్షాలు మొదలైన స్థానిక రవాణా సౌకర్యాలు తక్షణమే అందుబాటులో ఉన్నాయి.

వాతావరణం

ఎండిపోయినట్టు ఉండే ధన్ బాద్ జిల్లా శీతాకాలంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్టోబర్ నుండి మార్చ్ వరకు ధన్ బాద్ సందర్శనకు సరైన సమయం.

చేరుకోవడం ఎలా

పారిశ్రామిక రాజధానులలో ఒకటైన ధన్బాద్, భారతదేశంలోని అతిపెద్ద గనుల నగరాలలో ఒకటి. దేశం మొత్తం లోని ఏ ప్రాంతం నుండైనా ధన్ బాద్ వచ్చి వెళ్ళడానికి తక్షణ రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ధన్ బాద్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ధన్ బాద్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ధన్ బాద్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ధన్ బాద్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా 2 ,32 వ జాతీయరహదారి ధన్ బాద్ గుండా వెళ్తుంది. ఈ రెండు ప్రధాన రహదారులు వివిధ ప్రదేశాలతో బొగ్గు రాజధానిని కలుపుతాయి. స్వర్ణ చతుర్భుజిలో భాగమైన NH2 ధన్బాద్ కు ఢిల్లీ ని కలుపుతుంది. NH32 బొకారో, జంషెడ్పూర్ కు కలుపబడి ఉంది. నగరంలో ప్రయాణించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా ధన్ బాద్ , ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి భారతదేశంలోని ప్రధాన నగరాలకు రైలుమార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. దాదాపు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు రైలు మార్గం గుండా కలుపబడి ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటి ప్రవేశపెట్టిన AC డబుల్-డక్కర్ రైలు హౌరా, ధన్ బాద్ ను కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా ధన్ బాద్ లో స్వంత విమానాశ్రయం లేదు. బర్వడ్డ సమీపంలో ఇది ప్రణాళిక చేయబడింది. ఈ నగరానికి సమీపంలో కొన్ని విమానాశ్రయాలు ఉన్నాయి. ధన్బాద్, రాంచి లోని బిర్స ముండ విమానాశ్రయం నుండి 175 కిలోమీటర్లు, గయా విమానాశ్రయం నుండి 215 కిలోమీటర్లు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 269 కిలోమీటర్లు, కోల్కతా, పాట్న లోని లోక్ నాయక్ జయప్రకాశ్ విమానాశ్రయం నుండి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat