పంచేట్ డాం, దామోదర్ వాలీ కార్పోరేషన్ లోని బహుళ ప్రయోజనాల డాం లలో ఒకటి. ఇది 22,155 అడుగుల పొడవు, 124 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఇది ధన్బాద్ జంక్షన్ నుండి 54 కిలోమీటర్లు, గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై ఉన్న చిర్కుండా నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ ప్రదేశం విహారానికి ఎక్కువ గిరాకీ ఉంది. ఇది 6 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉండి, దామోదర్ నదిపై నిర్మించబడింది.
డాం కి తూర్పు వైపున నిర్మించిన హైడల్ స్టేషన్ వద్ద గంటకి 40,000 K.W. విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. పంచేట్ రిజర్వాయర్, ధన్బాద్ జిల్లలో దక్షిణాన ఉంది, వెస్ట్ బెంగాల్ లోని పురులియా జిల్లలో ఉత్తరాన ఉంది. 10 కిలోమీటర్ల దూరంలో సమీప రైల్వే స్టేషన్ కుమార్దుబి ఉంటె, పంచేట్ డాం నుండి అసంసోల్ 20 కిలోమీటర్లు ఉంది. దామోదర్ నది వరదలతో ఎక్కువగా ముంచెత్తడం జరిగింది. మైతాన్, పంచేట్ డాం ల వరద ఫ్రీక్వెన్సీ తగ్గింది. కాట్ల, రోహు, మ్రిగల్, ఎల్.కల్బాసు వంటి చేపలు పంచేట్ రిజర్వాయర్ లో కనిపిస్తాయి. ఇవి ఈ సరస్సులో చేపల పునరుత్పత్తి జరుగుతుందని తెలియచేస్తుంది.