తమిళ్ నాడు రాష్ట్రం లో మెట్టూర్ అతి పెద్ద డాములలో ఒకటి. ఇది ధర్మపురి జిల్లా లో కలదు. దీనిని కావేరి నది పై కట్టారు. కావేరి ఇక్కడ మెల్లగా ప్రవహిస్తుంది. ఈ డాం జిల్లాలో అత్యధిక విద్యుత్ అవసరాలు తీరుస్తుంది. ఈ డాము మెట్టూర్ టవున్ లో కలదు. ఈ టవున్ మతపరంగా కూడా ప్రసిద్ధి చెందినది. ఈ టవున్ చేరేందుకు రాష్ట్రం లో వివిధ ప్రాంతాల నుండి బస్సు మార్గాలు కలవు. ప్రతి సంవత్సరం ఆది పెరుక్కు అనే ప్రసిద్ధ పండుగను ఇక్కడ నిర్వహిస్తారు. మేట్టుర్ డాము ను స్టాన్లీ రిజర్వాయర్ అని కూడా రాష్ట్ర ప్రజలు పిలుస్తారు. మెట్టూర్ డాము లో రెండు ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ లు కలవు.