Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధర్మస్ధల » వాతావరణం

ధర్మస్ధల వాతావరణం

ధర్మస్ధల వాతావరణం  ధర్మస్ధల సందర్శనకు అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూల నెలలు. వాతావరణం అనుకూలంగా ఉండి ఆనందిస్తారు. జూలై నుండి సెప్టెంబర్ వరకు చలిగా ఉంటుంది. అయినప్పటికి సందర్శకులు ఎంతో ఇష్టంగా ఇక్కడకు వస్తారు.

వేసవి

వేసవి (మార్చి నుండి జూన్) - అధిక ఉష్ణోగ్రతలతో అసౌకర్యంగా ఉంటుంది. గరిష్టం 42 డిగ్రీలుగాను కనిష్టం 27 డిగ్రీలుగాను ఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - ఒక మోస్తరు నుండి భారీగా వర్షాలు పడతాయి. కనుక ఈ సమయంలో పర్యాటకులు ధర్మస్ధల రావటానికి ఇష్టపడరు.  

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) ఈ కాలంలో ధర్మస్ధల వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 18 గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలుగా ఉంటుంది. పర్యాటకులు చాలామంది ఈ సమయంలో ధర్మస్ధల సందర్శన చేస్తారు.