అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

గంగేశ్వర్ ఆలయం, డయ్యు

సిఫార్సు చేసినది

గంగేశ్వరుడు అన్న పదం శివుడికి మారుపేరు. ఈయన జటాజూటం మీదుగా గంగానది ప్రవహించి భువిమీద అవతరించింది. అందువలన ఈయనను భగవంతుడిగా ఆరాధిస్తారు. ఈ ఆలయాన్ని శివుడికే అంకితమయింది. ఇది డయ్యు నుండి మూడు కిలోమీటర్ల అవతల ఫాడం గ్రామంలో ఉన్నది.

డయు ఫోటోలు, గంగేశ్వర్ టెంపుల్ - లార్డ్ శివ

ఇది ప్రధానంగా సముద్ర తీరంమీద ఉన్న శిలల మధ్యలో ఉన్న ఒక గుహ ఆలయం. ఈ ఆలయంలో అయిదు శివలింగాలు ఉన్నాయి. వీటిని నిరంతరం అరేబియన్ సముద్ర అలలు కడుగుతుంటాయి. పరమశివుడికి సముద్ర తరంగాల వందనసమర్పణ ఆధ్యాత్మిక దృశ్యం సందర్శకులలో ఆధ్యాత్మికత, గౌరవం మరియు భక్తి భావాలకు స్ఫూర్తినిస్తున్నది.

ఈ ఆలయాన్ని పాండవులు వారి అజ్ఞాతవాసంలో రోజువారి పూజలకొరకు కట్టించారని పురాణాలు చెపుతున్నాయి. అందువలన ఈ ఆలయం మహాభారతకాలం నుండి ఉన్నదని చెపుతారు. సముద్రతీరాన ఉన్న ఈ గంగేశ్వర ఆలయం చారిత్రాత్మక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నది.

Please Wait while comments are loading...