ఝార్ఖండ్ లోని తీర్థయాత్ర నగరం దుమ్కా దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. సరైయహట్ తాలుకాలో ఉన్న బాబా సుమేశ్వరనాథ్ ఈ జిల్లాలో ఒక ప్రసిద్ధ ధార్మిక ప్రాంతం. ప్రధాన నివాసస్థానం నుండి ఇది 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి రోజు బాబా సుమేశ్వరనాథ్ లోని అతి పెద్ద శివాలయానికి అనేక మంది భక్తులు వస్తారు. విశేష సందర్భాలలో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రసిద్ధ మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. శ్రవణ మాసంలోకూడా వేలాదిమంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మంత్రాల పఠనం చేస్తూ, దేవుని పూజిస్తూ గంగానది నుండి పవిత్ర జలాన్ని సమర్పించడం బాబా సుమేశ్వరనాథ్ వద్ద ఒక సాధారణ దృశ్యం.