Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» దుంగార్పూర్

దుంగార్పూర్ – కొండల నగరం !

10

కొండల రాజ్యం, దుంగార్పూర్ రాజస్తాన్ రాష్ట్రం లోని దక్షిణ భాగం లో వుంది. ఈ పట్టణం దున్గార్పూర్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం గా వుంది. చారిత్రిక పత్రాల ప్రకారం ఇది ఇంతకు పూర్వం దుంగార్పూర్ రాజ్యానికి రాజధాని. ఈ జిల్లా లోని భిల్ జాతి వారు ఇక్కడి ప్రధాన, పురాతన నివాసులు, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారు. భిల్ జాతి ముఖ్య నాయకుడి నుంచి దుంగార్పూర్ ను వీర్ సింగ్ మహారాజు చేజిక్కించుకున్నాడు.

బొమ్మల తయారీ & చిత్రాలకు పటాలు కట్టడం – వికసించిన సృజనాత్మకత

ఇక్కడి దేశవాళీ బొమ్మల తయారీ కేంద్రం గురించి ప్రస్తావించక పొతే ఈ ప్రాంత వర్ణన అసంపూర్ణంగా వుంది పోతుంది. చెక్క నుంచి తయారయ్యే అందమైన బొమ్మలకు మెరుపులు అద్దడానికి లక్క ఉపయోగిస్తారు. అధిక భాగం బొమ్మలు మనుష్యులను జంతువులను పోలి వుంటాయి. వివిధ పండుగలు, సందర్భాల్లో ఈ బొమ్మలను విరివిగా ప్రదర్శిస్తారు. బొమ్మల తయారీకే కాక, దుంగార్పూర్ కంసాలి వారు తయారు చేసే చిత్ర పటాలకు కూడా ప్రసిద్ది.

దుంగార్పూర్ పట్టణం విస్తృత స్థాయి వారి సాగుకి, టేకు, మామిడి, ఖర్జూరాల ఉత్పత్తికి కూడా ప్రసిద్ది పొందింది. దుంగార్పూర్ లోని దట్టమైన అడవుల్లో పర్యాటకులు పర్వతారోహణ చేస్తూ – తోడేళ్ళు, అడవి పిల్లులు, నక్కలు, ముళ్ళ పందులు, ముంగిసలు లాంటి జంతు జాతులను కూడా చూడవచ్చు.

పండుగలూ – పర్వదినాలు – ఆనంద ప్రదర్శన !

దుంగార్పూర్ లోని బనేశ్వర్ దేవాలయం లో నిర్వహించే గిరిజనుల ప్రసిద్ధ పండుగ బనేశ్వర్ ఉత్సవం. ఫిబ్రవరి లో వచ్చే పౌర్ణమి లేదా మాఘ శుక్ల పౌర్ణమి నాడు జరిగే ఈ ఉత్సవం చూడడానికి ఈ దేవాలయానికి అనేక మంది భక్తులు వస్తారు. ఈ పవిత్ర సమయంలో, గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ ల నుంచి మహి, సోమ నదుల సంగమంలో స్నానం చేయడానికి ఇక్కడికి భిల్లులు వస్తారు. తాంత్రిక వినాయకుడు, జింక చర్మ దారి అయిన బ్రహ్మ, వీణ చేపట్టిన శివుడు, పద్మిని, పద్మపాణి యక్షుడు, గరుడారూడ అయిన వైష్ణవి విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు. ఈ పండుగలో ఈ ప్రాంతపు నృత్య రీతులు, సంగీతం రుచి చూడవచ్చు. హిందువుల ప్రసిద్ధ పండుగ హోలీ ని ఇక్కడ గిరిజన నృత్యాలతో జరుపుకుంటారు. దీపాల పండుగ దీపావళిని, దీపావళి తర్వాత జరిగే బార్ బ్రిజ్ ఉత్సవం ఈ ప్రాంతపు ప్రధాన పండుగలు.

అద్భుత నిర్మాణాలు – రాతి మీద వర్ణనలు

ఆకర్షణీయమైన బొమ్మలు, పండుగలు, వన్యప్రాణులకే కాక దుంగార్పూర్ రాజ ప్రాసాదాలకు, పురాతన ఆలయాలకు, మ్యూజియం లకు, సరస్సులకు కూడా ప్రసిద్ది చెంది౦ది. రాజపుత్ర నిర్మాణ శైలికి ప్రసిద్ది చెందింది ఉదయ విలాస్ భవనం. ఈ పెద్ద భవనాన్ని – రాణీవాసం, ఉదయ విలాసం, కృష్ణ ప్రకాశం లేదా ఏక్ తంబియా మహల్ అనే మూడు విభాగాలుగా విభజించారు.

క్లిష్టమైన రీతిలో చెక్కిన వసారాలు, తోరణాలు, కిటికీలకు ప్రసిద్ది చెందిన ఈ ప్రాసాదం ఇప్పుడు ఒక వారసత్వ హోటల్ గా మారిపోయింది. గాజు, అద్దాల పనికి ప్రసిద్ది చెందిన జునా మహల్ ను కూడా పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు. దుంగార్పూర్ లో మరో అద్భుత భవనం బాదల్ మహల్. గాయిబ్ సాగర్ సరస్సు ఒడ్డున వున్న ఈ భవనం విస్తారమైన నమూనాలకు, రాజపుత్ర, ముఘలాయి నిర్మాణ శైలుల మిశ్రమ శైలికి ప్రసిద్ది పొందింది.

దుంగార్పూర్ అనేక హిందూ, జైన ఆలయాలకు ప్రసిద్ది చెందింది. పర్యాటకులు ఈ ప్రాంతంలో ఉన్నపుడు వనేశ్వర్ ఆలయం, భువనేశ్వర్, సూర్పూర్ ఆలయం, దేవ్ సోమనాథ్ ఆలయం, విజయ్ రాజరాజేశ్వర్ ఆలయం, శ్రీనాథ్ జి ఆలయం చూడవచ్చు. దాని ఒడ్డున వున్న అనేక దేవాలయాలు, ప్రాసాదాల వల్ల గాయిబ్ సాగర్ సరస్సు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ గా మారింది. దుంగార్పూర్ వెళ్లాలనుకునే యాత్రికులు రాజమాతా దేవేంద్ర కున్వర్ ప్రభుత్వ మ్యూజియం, నాగ ఫణ జీ, గలియా కోట్, ఫతే ఘరీ కూడా చూడాలి.

దుంగార్పూర్ చేరుకోవడం

దుంగార్పూర్ జిల్లా వాయు, రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానించబడి ఉ౦ది. ఉదయపూర్ లోని మహారాణా ప్రతాప్ విమానాశ్రయం లేదా దబోక్, దుంగార్పూర్ కి సమీప విమానాశ్రయం. విదేశీ పర్యాటకులు న్యూ డిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐ జి ఐ) నుండి దుంగార్పూర్ చేరుకుంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రత్లాంలోని రైల్వే స్టేషన్ దుంగార్పూర్ కి సమీప రైల్వే స్టేషన్. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ రెండిటి నుండి కాబ్స్ ద్వారా ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. పర్యాటకులు ఉదయపూర్, ఇతర సమీప నగరాల నుండి బస్సులలో ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు.

సంవత్సరం మొత్తం దుంగార్పూర్ వేడి, పొడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అక్టోబర్, నవంబర్ మధ్య వాతావరణం ఆహ్లాదంగా ఉండటం వల్ల ఈ సమయంలో దుంగార్పూర్ విశ్రాంత యాత్ర చేయడం ఉత్తమం.

దుంగార్పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

దుంగార్పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం దుంగార్పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? దుంగార్పూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా: పర్యాటకులు ఉదయపూర్ నుండి ఈ ప్రదేశానికి ప్రభుత్వ బస్సుల ద్వారా చేరుకోవచ్చు. సమీప నగరాల నుండి దుంగార్పూర్ కి వెల్లడ్నికి ప్రైవేట్, విలాసవంతమైన బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా: మధ్య ప్రదేశ్ లోని రత్లం, దుంగార్పూర్ కి సమీప రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కి డిల్లీ, ముంబై, చెన్నై వంటి భారతదేశ ప్రధాన నగరాల నుండి రోజువారీ రైళ్ళు అనుసంధానించబడి ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి దుంగార్పూర్ కి కాబ్స్ ద్వారా సరసమైన ధరలలో వెళ్ళవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం ద్వారా: ఉదయపూర్ లోని మహారాణా ప్రతాప్ విమానాశ్రయం లేదా దబోక్ విమానాశ్రయం దుంగార్పూర్ కి సమీప విమానాశ్రయం. ఈ విమానాశ్రయానికి డిల్లీ, ముంబై, హైదరాబాద్, జైపూర్, జోధ్పూర్, అహ్మదాబాద్ వంటి భారతదేశ౦ లోని ప్రధాన ప్రాంతాల నుండి రోజువారీ విమానాలు అనుసంధానించబడి ఉన్నాయి. విదేశీ పర్యాటకులు న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐ జి ఐ) నుండి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. పర్యాటకులు మహారాణా ప్రతాప్ విమానాశ్రయం నుండి దుంగార్పూర్ కాబ్స్ ద్వారా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu