క్లిష్టమైన నిర్మాణాత్మక నమూనాలకి ప్రసిద్దిచెందిన బాదల్ మహల్, గాయిబ్ సాగర్ సరస్సు ఒడ్డున ఉంది. ఈ భవనం మొఘల్, రాజపుత్ర నిర్మాణ శైలి కలయికను ప్రదర్శిస్తుంది. ఈ భవన నిర్మాణానికి దావ్రా రాళ్ళను ఉపయోగించారు. ఈ స్మారక స్థూపానికి రెండు దశలు, మూడు గోపురాలు, వరండా ఉన్నాయి. ఈ గోపురాల పైభాగం అరవిచ్చిన తామరపూల ఆకార౦తో ఉండి, మొత్తం నిర్మాణానికి మరింత అందాన్ని తెచ్చింది.