Search
  • Follow NativePlanet
Share

జొంగు  – లేప్చాల భూమి  !!

6

జొంగు, ఉత్తర సిక్కింలో వున్న అసలైన వాసులు లేప్చాల భూమి – గ్యాంగ్ టక్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం ప్రాకృతిక దృశ్యాలతో నిండినప్పటికి పెద్దగా అన్వేషించబడలేదు. ఈ ప్రాంతం అద్భుతమైన వృక్ష, జంతు సంపదతో, దాని పర్యాటకులకు పూర్తి సిక్కిం పర్యాటకరంగానికి చెందిన మనోహరమైన అనుభూతిని అందిస్తుంది.

జొంగులో ఉన్నప్పుడు దాని ప్రజలతో ఉండండి . . .జొంగు ప్రత్యేకత దాని ప్రజలు – లేప్చాలు. ఈ సమాజానికి చెందిన ప్రజలు ఏకాంతంగా నివసించడ౦లో విశ్వసిస్తారు. అందువల్ల వారు బయటి ప్రపంచం నుండి ఎంతో దూరంగా ఉన్నారు. జొంగులో పర్యటన అందాన్ని ఇది రెట్టింపు చేస్తుంది. అందువలన, ఇంటి దగ్గర ఉండటం అనే అందమైన అనుభవాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తారు. బహుశా, సిక్కిం వచ్చే ప్రతి పర్యాటకుడు జొంగు వచ్చి, ఇంటి బసను అనుభవించి, తిరిగి లేప్చాల జీవనశైలిని, వారి ప్రత్యేకమైన సంప్రదాయాన్ని, సంస్కృతిని తెల్సుకోవాలి.  లేప్చాల ఈ స్వస్థలాన్ని సందర్శించినప్పుడు లేప్చాల సంప్రదాయ పానీయం – ఛీ ను రుచి కూడా చూడటం మరువకండి.

భౌగోళిక స్థితి జొంగు, సముద్రమట్టానికి  3000-20,000 అడుగుల ఎత్తున ఉంది. కంచనజంగా జీవావరణ రక్షిత ప్రదేశానికి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం కంచనజంగా పర్వతానికి చెందిన కొన్ని ప్రత్యేకమైన దృశ్యాలను అందిస్తుంది.జొంగులో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి?

జొంగులో ఉన్నప్పుడు దీనిలో ఉన్న కొన్ని ప్రదేశాలను సందర్శించడం మీ పర్యటనను ఇంకా అందంగా మార్చుతుంది: సెవెన్ సిస్టర్స్ జలపాతాన్ని సందర్శించండి – కనువిందుగా ఉంటుంది ఈ జలపాతం, గ్రామంలో అధిరోహణకు వెళ్ళండి, జొంగు అందమైన యాలుక తోటలు మధ్య నడిచి తీస్తా నది దగ్గర విశ్రాంతి తీసుకోండి, పాసింగ్ డాన్ అందమైన వెదురు కొయ్యలవంతెన పై నుండి నడవండి, లేప్చాలు స్థానికంగా పెరిగే ఔషధ మొక్కలతో ప్రజల రోగాలను ఎంత చక్కగా తగ్గించి, నయం చేస్తారో నేర్చుకోవడం మరవకండి! ఇవి అన్ని మీ సిక్కిం పర్యటనను ఒక మరుపురాని అనుభూతిగా మారుస్తాయి.

జొంగు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జొంగు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జొంగు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జొంగు

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా గాంగ్ టక్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న జొంగుకు రోడ్డు ద్వారా సులువుగా చేరవచ్చు. గాంగ్ టక్ నుండి జొంగుకు చక్కటి బస్సు సౌకర్యం ఉంది. ఈ ప్రాంతానికి ప్రైవేట్ టాక్సీలు, లేదా షేర్ టాక్సీలు ద్వారా కూడా చేరవచ్చు. అయితే, జొంగు ప్రవేశించడానికి మనం సిక్కిం ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. దీనిని గాంగ్ టాక్ లేదా ఢిల్లీలోని పర్యాటక కార్యాలయంలో పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా *జొంగులో రైలు స్టేషన్ లేదు. జొంగుకు దగ్గరి రైలుస్టేషన్ న్యూ జల్పాయిగురి. పర్యాటకులు, ఇక్కడి నుండి టాక్సీలో జొంగు సులువుగా చేరవచ్చు. వారు గాంగ్ టక్ మీదుగా కూడా జొంగు చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానమార్గం ద్వారా జొంగుకు దగ్గరి విమానాశ్రయం పశ్చిమ బెంగాల్ లోని బాగ్డోగ్రా. విమానాశ్రయం నుండి టాక్సీ ద్వారా గాంగ్ టక్ లేదా సింగ్తెం మీదుగా జొంగు చేరవచ్చు. విమానాశ్రయం నుండి జొంగు చేరడానికి సుమారు ఐదు గంటల సమయం పడ్తుంది. గో ఎయిర్, ఇండియన్ ఎయిర్ లైన్స్, జెట్ ఫ్లైట్స్ వారి విమానాలు బాగ్డోగ్రాకు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri