ఎల్లోరా వాతావరణం ఎల్లోరా గుహలు సంవత్సరంలో ఎపుడైనా సరే చూడవచ్చు. ఇక్కడి వాతావరణం అనుకూలంగానే ఉంటుంది.
వేసవి - వేసవిలో ప్రయాణం కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది. వేడి కారణంగా విదేశీయ పర్యాటకులకు మరింత అసౌకర్యంగా ఉంటుంది.
వర్షాకాలం - వర్షంలో తడిసేందుకు ఇష్టపడేవారైతే వర్షాకాలం సందర్శనకు అనుకూలమే. చుట్టుపట్ల పర్యావరణం ఈ కాలంలో రమణీయంగా ఉంటుంది.
శీతాకాలం - అక్టోబర్ మధ్య భాగం నుండి మార్చి వరకు సందర్శన ఎంతో అనుకూలం. వాతావరణం పొడి పొడిగా చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది.