దానికదే ప్రత్యేకత కల్గిన అనూప్ తలావ్, అక్బర్ స్వంత భవనాల ఎదురుగా నిర్మించిన అద్భుతమైన ఒక నీటి చెరువు. ఖవాబ్గాహ్ ప్రాంగణం ఎదురుగా నిర్మించిన ఆ రోజుల్లోని నిర్మాణాలలో ఎంతో ఆకట్టుకొన్న కట్టడం ఇది. ఒక అందమైన వేదిక ఉన్న ఈ ఎరుపు ఇసుకరాయి కట్టడం నుండి పరిసరాలను చూసేందుకు చక్కటి ప్రణాళికతో కూర్చొనే ఏర్పాట్లను చేసారు. నాలుగు వైపులలోని అన్ని చిన్న దారుల గుండా ఈ నిర్మాణానికి మార్గం ఉంది. అప్పటి రోజుల్లో, నిరంతరం మంచినీటి ప్రవాహం ఉండేలా ప్రత్యేకంగా దీనిని ప్రధాన నీటి వ్యవస్థకు కలిపారు.
పురాతన మూలాలు, వ్రాతప్రతుల ననుసరించి ఈ చెరువులో నింపిన అనేక వెండి, బంగారు నాణేలు సూర్యుని కిరణాలు తాకినప్పుడు తళతళ మని మెరిసేవి. వీటిలో అనేక నాణేలను జహంగీర్ తర్వాతి కాలంలో దానం చేసాడు. నిజానికి ఈ చెరువును ఖాళీ చేసి ఒక కోటి మూడు లక్షల నాణేలను దానం ద్వారా పంపిణీ చేశాడని చక్రవర్తి తన జ్ఞాపకాలలో తెలిపాడు.