Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గంగోత్రి » వాతావరణం

గంగోత్రి వాతావరణం

ప్రయాణానికి అనుకూలమైన కాలం ఇక్కడికి చేరుకోవాలంటే ఏప్రిల్ మరియు జూన్ నెలలు అనుకూలంగా ఉంటాయి. పర్యాటకులు గంగోత్రిని సందర్శించటానికి సెప్టెంబర్ మరియు నవంబర్ నెలలు కూడా అనుకూలంగా ఉంటాయి.

వేసవి

ఇక్కడ సంవత్సరమంతా 9 డిగ్రీల సెంటిగ్రేడ్ సగటు ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ వేసవికాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కాని, శీతాకాలం విపరీతమైన మంచువానలు కురిసి, వాతావరణం గద్దకట్టుకునే ఉంటుంది.వేసవికాలం (మార్చ్ నుండి మే) : వేసవికాలం మార్చ్ నెలలో ప్రారంభమై, మే నెల చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో, సగటు ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది.

వర్షాకాలం

వానాకాలం (జూలై నుండి ఆగష్టు) : ఇక్కడ వానాకాలం జూలై నెలలో మొదలై, ఆగష్టు చివరన అంతమవుతుంది. ఈ ప్రాంతంలో ఈ సమయంలో భారి వర్షపాతం నమోదు అవుతుంది. అందువలన ఈ సమయంలో దేవాలయాన్ని దర్శించటం కష్టమైన పని.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) : ఇక్కడ శీతాకాలం డిసెంబర్ మరియు ఫిబ్రవరి నెలల మధ్యన ఉంటుంది. ఈ సమయంలో, భారీ మంచువానలు కురుస్తాయి మరియు ఇక్కడి వాతావరణం విపరీతమైన చలి ఉంటుంది.