Search
  • Follow NativePlanet
Share

గంజాం – తీరాలు, పండుగల నిలయం !!

గంజాం ఒడిశా లోని ముఖ్యమైన జిల్లాల్లో ఒకటి. ఆహార ధాన్యాల నిల్వ గది అని అర్ధం వచ్చే ‘గన్-ఇ-ఆమ్’ అనే పదం నుంచి ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. గంజాం బంగాళా ఖాతం ఒడ్డున వుంది – అందువల్ల ఎన్నో అందమైన బీచ్ లతో ఏడాది పొడవునా పర్యాటకులతో కిటకిట లాడుతూ వుంటుంది. పెద్ద పెద్ద కొండల మధ్య దట్టమైన పచ్చదనంతో, అందమైన నదులతో ఈ మనోహరమైన ప్రదేశంలో పురాతన అవశేషాలు కూడా వున్నాయి.

21

పవిత్రమైన, ప్రాచీన దేవాలయాలు వుండే గంజాంలో దేవుడి మహిమల కోసం నిత్యం భక్తులు కిటకిటలాడుతూ వుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మందితో జరిగే డోలో యాత్ర, తరతారిణీ మేళా, దండ యాత్ర, తకురాని యాత్ర లాంటి పండుగలప్పుడు గంజాం పర్యాటకం ఊపందుకుంటుంది. రాతి చెక్కుళ్ళు, వెదురు కళాకృతులు, చెక్క బొమ్మలు, గృహోపకరణాలు, ఇత్తడి నమూనాలు కలిసిన అందమైన హస్త కళాకృతులు ఈ జిల్లా వైభవానికి సొబగులు అద్దుతుంది.

గంజాం లోను, చుట్టు పక్కలా పర్యాటక స్థలాలు

ప్రకృతి శక్తులకు దేవతల మహిమ బలం కలిగించే ప్రదేశంగా గంజాం ను చెప్పుకోవచ్చు. గంజాం పర్యాటకంలో అందమైన తీరాలు, పచ్చని లోయలు, అద్భుతమైన కొండలు, వాటిలోని మార్మికమైన గుహలు, అందమైన దేవాలయాలు అన్నీ కలిసి వుంటాయి. ఆర్యపల్లి, హుమా కంటియాగడా లాంటి కొన్ని అందమైన ఇసుక తీరాలు ప్రపంచంలోనే సాటి లేనివి. గిరిసోల ఆంద్ర ప్రదేశ్ నుంచి ఒడిశాకు వెళ్ళే ముఖద్వారం. ఇది పతీ సోనేపూర్ బీచ్ కు, భైరాబీ దేవాలయం గిరిసోలను యాత్రికులకు పసందైన గమ్యస్థానంగా మార్చాయి.

ఆస్కా నుంచి బుగుడా వెళ్ళే దారిలో బెతానాయ్ లో ఆగి నల్లటి దుప్పిని చూడాలి. గంజాంలో వున్న చాలా ప్రాచీన, అందమైన గుళ్ళు దీన్ని ఒక ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మారుస్తాయి. అథగడపట్నా లో ప్రాచీన, భవ్యమైన జగన్నాథ దేవాలయం వుంది. గంజాం, బెర్హంపూర్ వెళ్ళే యాత్రికులు తప్పక చూడాల్సిన మహురి కలువా దేవాలయం. నిర్మల్ ఝారా లో విష్ణువు విగ్రహం పాదాల నుంచి బయటకు వచ్చే నీటి కొలను అధ్బుత దృశ్యాన్ని చూడవచ్చు. పంచమ, ఉజల్లెశ్వర్ లో వుండే ఇతర దేవాలయాలలో దేవతలను ప్రకృతి ప్రశాంతత నడుమ పూజించుకోవచ్చు. జౌగడ లో వున్న అశోకుడి శిలా శాసనాలు ఏడాది పొడవునా అనేక మంది యాత్రికులను ఆకర్షిస్తాయి.

గంజాం సందర్శనకు ఉత్తమ సమయం

అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వాతావరణం చల్లగా వుంటుంది కనుక అది గంజాం సందర్శనకు ఉత్తమ సమయం

గంజాం చేరుకోవడం ఎలా ?

గంజాం కు బెర్హంపూర్ రైల్వే స్టేషన్ లోని అన్ని సర్వీసులకు అనుసంధానం వుంది, కాగా భుబనేశ్వర్ ఇక్కడికి సమీప విమానాశ్రయం. ఈ జిల్లా లో అన్ని రకాల రోడ్డు రవాణా సౌకర్యాలు వున్నాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వాతావరణం చల్లగా వున్నప్పుడు గంజాం సందర్శనకు మంచి సమయం.

గంజాం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గంజాం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం గంజాం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? గంజాం

  • రోడ్డు ప్రయాణం
    Owing to its huge popularity across the state and nation, Ganjam is well equipped with good bus services. Anyone can board a bus from any cities of Odisha run by the state government to reach Ganjam. Apart from this, one can avail a taxi to reach Ganjam and the tourist places in and around it.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    The nearest major rail head is the Behrampur Railway Station located at a distance of 1.8 km. Ganjam has a railway station on its own name as well but ii is not well-connected with other parts of the country. On the other hand, the Behrampur Railway Station is well connected with all the major cities of the state as well as the country.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    The nearest airport to Ganjam is the Biju Patnaik Airport in Bhubaneswar located at a distance of 163 km. The airport is an international one connecting to all the major airport of India as well as many important places abroad. From here, one can board a train or hire a taxi to Ganjam.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat