టిల్లన్ చోన్ ద్వీపం చాలా చిన్నది. అరుదుగా కనపడే పక్షులు నార్కొన్ డాం హార్న్ బిల్ మరియు నికోబార్ మేగాపోడ్ వంటివి ఇక్కడ నివసిస్తాయి. ఈ దీవి జనాభా చాలా తక్కువ. అయితే, పర్యాటకులకు ఈ దీవిలో ఎన్నో ఆకర్షణలు కలవు. అండమాన్ నికోబార్ లలోని ఇతర దీవుల వలే కాక టిల్లన్ చోంగ్ మూడు నికోబార్ కుటుంబాలచే యాజమాన్యం కలిగి ఉంది. వారిచే పాలించబడుతోంది. ఈ యజమానులు ఇక్కడకు సంవత్సరానికి ఒక సారి వచ్చి చూసి వెళుతూంటారు. 17 చదరపు కిలో మీటర్లు విస్తీర్ణం కల ఈ దీవి పూర్తిగా పచ్చటి ప్రదేశం. ఈ ప్రాంతంలో కూడా చాలా చెట్లు నరికివేయబడుతూండటంతో కొన్ని జాతుల పక్షులు కనుమరుగవుతున్నాయి. కనుక ఇక్కడ ఒక వన్య పక్షి సంరక్షణాలయం స్ధాపించారు.