Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుల్మార్గ్ » వాతావరణం

గుల్మార్గ్ వాతావరణం

పర్యటనకు అనుకూల సమయం మార్చ్ నుండి అక్టోబర్ ల మధ్య ఈ ప్రాంత పర్యటన అనుకూలం గా వుంటుంది. సందర్శకులు ఈ సమయం లో ప్రకృతి అందాలను చూడటానికే కాదు, ట్రెక్కింగ్ వంటి వివిధ సాహస క్రీడల లో కూడా పాల్గొనవచ్చు.

వేసవి

గుల్మార్గ్ లో మూడు ప్రధాన కాలాలు వుంటాయి. అవి వేసవి, వర్ష, చలికాలాలు. పర్యటనకు వేసవి అనుకూలమే కాని వర్షాకాలం మరియు చలి కాలాలు ప్రాంత అందాలను మరింత పెంచి ఆకర్షనీయం చేస్తాయి. వేసవి వేసవి మార్చ్ లో మొదలై మే చివరి వరకూ వుంటుంది. ఈ సమయం లో గుల్మార్గ్ ఎంతో ఆహ్లాదం గా వుంటుంది. సగటు ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుండి 29 డిగ్రీల వరకూ మారుతూంటాయి. పర్యటన అనుకూలంగా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం గుల్మార్గ్ లో జూలై నుండి అక్టోబర్ వరకూ వుంటుంది. ఈ ప్రాంతం లో వర్షాలు ఒక మోస్తరు . ఈ సమయంలో వచ్చే పర్యాటకులు వర్షపు దుస్తుల పట్ల జాగ్రత్త వహించాలి

చలికాలం

శీతాకాలం గుల్మార్గ్ లో శీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ కాలం లో సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుండి 9 డిగ్రీల వరకూ మారుతూంటాయి. దట్టమైన మంచు కురుస్తుంది మంచు 12 మీటర్ల వరకూ ఈ ప్రాంతంలో రికార్డు అయ్యింది. సాహస క్రీడలు ఆచరిన్చాలనుకునే వారికి ఇది సరైన సమయం. లాంగ్ రన్ స్కై ఇంగ్ మరియు స్నో బోర్డింగ్ వంటివి ఈ సమయంలో చేయవచ్చు.