లోటస్ దేవాలయం మరియు లోటస్ పేలస్. ఈ నిర్మాణం భారతీయ మొగలుల శిల్ప నైపుణ్యానికి అద్దం పడుతుంది. ఇది హజారా రామ దేవాలయంకు దగ్గరలో ఉంది. కలువ పూవు రేకులవలే ఉన్నది కనుక దీనిని లోటస్ టెంపుల్ అని పిలుస్తారు. మరోపేరుగా కలువ మహల్ మరియు చిత్రాంగని మహల్ అని కూడా అంటారు. చక్కటి ఆర్చీలతో కూడిన ఈ రాజప్రాసాదం రెండు అంతస్తులు కలిగి ఉంటుంది.రాచ కుటుంబాలకు చెందిన రాణులు, వారి స్నేహితులు ఈ ప్యాలెస్ లో సమావేశాలు చేసి ఆనందించేవారు. వేసవిలో ఈ ప్యాలెస్ ఎంతో చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతం శత్రువుల పట్టులో కూడా తన వైభవాన్ని కోల్పోలేదు. ఈ లోటస్ ప్యాలెస్ ను సున్నం, ఇటుకలతో నిర్మించారు.