పర్యాటకులు విరుపాపుర గద్దె తప్పక చూడాలి. ఇది హంపిలోని విరూపాక్ష దేవాలయానికి సన్నిహితంగా ఉంటుంది. ఇక్కడి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి. అంతేకాక పర్యాటకులకు గుడిసెలు మరియు లాడ్జిలు కూడా ఉంటాయి. దీనిని హిప్పీ లు దాక్కునే ప్రదేశంగా చెపుతారు. నది దాటటానికి బ్రడ్జి లేదు కనుక నావ పై దీని వద్దకు ప్రయాణించాలి.
ఈ ప్రదేశం చేరిన పర్యాటకులు బుక్క ఆక్విడెక్టు అవశేషాలను, ఒక పురాతన వంతెనను చూడవచ్చు. అనెగొండి ఆంజనేయ దేవాలయం మరియు పంపా సరోవరం చూసేందుకు పర్యాటకులు బక్కా అక్విడెక్ట్ ఉపయోగించవచ్చు. పగలంతా ప్రదేశం చూసి రాత్రులందు ఒక తాటాకుల గుడిసె అద్దెకు తీసుకొని నిద్రించవచ్చు. బౌల్డరింగ్ పై ఆసక్తి కలవారికి ఇది చక్కని ప్రదేశం. అందుకవసరమైన వస్తువులు ఇక్కడి గెస్ట్ హౌస్ లనుండి వారు పొందవచ్చు.