ఈ గ్రామం హర్శిల్ నుంచి 3కి.మీ దూరం లో గంగా నది ఒడ్డున, పచ్చని దేవదారు వృక్షాల నడుమన ఉంది. వివిధ రకాల యాపిల్ తోటలు, చిక్కుడు పంటలు, మంచు తో కప్పబడిన శిఖరాలు సందర్శకులకి ఇక్కడ కనువిందు చేస్తాయి. కేదార్ నాథ్ గుడిని పోలిన నిర్మాణశైలి తో ఇక్కడ ఒక ప్రాచీన శివమందిరం ఉంది. అలాగే ముకిమత్ గుడి, గంగొత్రి, తపోవనం, వాసుకీ తాల్, గంగ్నానీ, చిర్బాస వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి.