ఈ జాతీయ పార్క్, సందర్శకులు తప్పక వీక్షించవలసిన ప్రదేశం. గ్రామం నుంచి 30 కి.మీ దూరం లో, దాదాపు 1553 చ.కి.మి. విస్తీర్ణం లో ఉన్న ఈ పార్క్ లో 15 రకాల జంతువులు, 150 రకాల పక్షులు ఉన్నాయి. ఇక్కద అరుదైన చిరుతలు (స్నో లెపర్డ్), ఎలుగు బంట్లు (బ్రౌన్ బేర్), జింకలు (మస్క్ డీర్), బార్బెట్ అనబడే హిమాలయ పక్షులు, సెరోస్ అనబడే మేకను పోలిన హిమాలయ జంతువులు, ఫెజెంట్ అనబడే కాకిని పోలిన పక్షి, పులులు, కొక్లాస్ అనబడే హిమాలయ పక్షులు, కపింజలము (పార్ట్రిడ్జ్) అనబడే పక్షి, పారకీట్ అనబడే ఒక రకమైన చిలుక వంటివి ఇందులో ఉన్నాయి.