Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హస్సన్ » వాతావరణం

హస్సన్ వాతావరణం

అనువైన సమయం : హస్సన్ చూడ్డానికి అక్టోబర్ – మార్చ్ మధ్య కాలం అనువుగా వుంటుంది. వేసవి ఎండల వల్ల, వర్షాకాలంలో వానల వల్ల యాత్రికులు ఇక్కడికి రావడం మానేస్తారు.

వేసవి

వాతావరణం సముద్ర మట్టానికి 934 మీటర్ల ఎత్తులో ఉండటంవల్ల, హస్సన్ లో వాతావరణం ఏడాది పొడవునా ఎంతో హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవి (మార్చ్ నుండి మే వరకు): వేసవిలో హాసన్ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల వరకు ఉంటే, రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీలకు తగ్గుతుంది. హాసన్,  ఏప్రిల్ నెలలో చాలా వేడిగా ఉండటం వల్ల ఎక్కువమంది ప్రయాణీకులు ఆ సమయంలో రావడం మానుకుంటారు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్ వరకు): హసన్ లో వర్షాకాలంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ప్రయాణీకులు ఈ కాలంలో హస్సన్ రావడానికి ఇష్టపడరు, ఎందుకంటే బయటకు తిరగడానికి ఈ సమయం అనువైనది కాదు.  

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు):  శీతాకాలం లో హాసన్ లోని వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలం లో గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుండి 31 డిగ్రీల మధ్య వుంటుంది. ఈ కాలంలో అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండటం వల్ల అనేకమంది పర్యాటకులు తరలి వస్తారు.