లోటస్ టెంపుల్ ను హిందీలో హమల మందిరం అంటారు. ఇది జుమ్బు ద్వీప్ టెంపుల్ ప్రాంగణం లోనే వుంటుంది. ఈ టెంపుల్ ను ఫిబ్రవరి 1975 లో నిర్మించారు. నిర్మాణం చిన్నది అయినప్పటికీ ఎంతో అందంగా వుంటుంది. ఈ లోటస్ టెంపుల్ లో మహావీరుడి విగ్రహం వుంటుంది. ఈ టెంపుల్ కు భక్తులు, యాత్రికులు, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు.
తమ కోరికలు తీరినందుకు గాను దీపాలను వెలిగిస్తారు. బంగారు గొడుగులు సమర్పిస్తారు. ఈ టెంపుల్ సుమేరు పర్వతం పక్కగా వుంటుంది. సుమేరు పర్వతం నుండి జంబు ద్వీపం లోని పర్వత, నది, టెంపుల్, గార్డెన్ దృశ్యాలను, చుట్టుపట్ల కల నగరాన్ని చూడవచ్చు. జైన గ్రందాల మేరకు సుమేరు పర్వతం ఎంతో పవిత్రమైనది. మరియు విశ్వంలో ఎత్తైనది. జైన తీర్తంకరులందరూ ఇక్కడే అభిషేకించ బడ్డారు.