ప్రసిద్ధ చిన్నమస్తా ఆలయం ఉన్న ఝార్ఖండ్ లో NH23 పై ఉన్న రాజ్రప్ప, హజరిబాఘ్ లోని ఒక యాత్రాస్థలం. ఇది ఒక శక్తిపీఠం, రాతి, కామదేవ్ ల సరీరాలపై చినమస్తిక దేవత తలలేని విగ్రహం ఉంది. ఈ పురాతన ఆలయం తాంత్రిక శైలి నిర్మాణానికి ప్రసిద్ది చెందింది. ఈ కాళి ఆలయాలలో జాతు బలులు జరుగుతాయి. రాజ్రప్ప, గిరిజన ప్రజలకు, ప్రత్యేకంగా ఝార్ఖండ్ లోని సంతల్ గిరిజనులకు ఒక పవిత్ర స్థలం కూడా. ఎక్కువగా డిసెంబర్ మాసంలో యాత్రీకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇది హిందువులకు ఒక ప్రధాన యాత్రాస్థలం. బీహార్, వెస్ట్ బెంగాల్ ప్రజలు ఏడాది పొడవునా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.
రాజ్రప్ప ప్రసిద్ధ విహార కేంద్రం కూడా. రాజ్రప్ప జలపాతం ఒక పర్యాటక కేంద్రం. భేర నది తోపాటు దామోదర్ నది ఈ 30 అడుగుల ఎత్తైన జలపాతాన్ని రూపొందించాయి. ఇక్కడి ప్రకృతి ప్రదేశాలు, అద్భుత రాతి కట్టడాలను చూసి ప్రజలు ఆనందించవచ్చు, బోట్ రైడ్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.