ఇడుక్కి నుండి 5 కి మీ ల దూరంలో ఉన్న కల్వరి పర్వతం కట్టపన - ఇడుక్కి రోడ్డులో ఉంది. ఈ పర్వతం ఏటవాలుగా ఉంటుంది. ఏంతో మంది పర్యాటకులని అమితంగా ఆకర్షించే పర్వతం ఇది. గుడ్ ఫ్రైడే మరియు లెంట్ పండుగల రోజున జరిగే ఉరేగిమ్పులకి ఈ ప్రాంతం ప్రసిద్ది. శిలువ వేయబడిన ఏసుక్రీస్తు జ్ఞాపకార్ధంగా ఏప్రిల్ నెలలో భక్తులు శిలువలు పట్టుకుని నడుస్తారు. ఈ ప్రాంతం నుండి కనిపించే పరిసర ప్రాంతాల వీక్షణ అద్భుతంగా ఉంటుంది. ఒక కోణం లోంచే ఇడుక్కి డ్యాం నుండి అయ్యప్పన్ కోవిల్ వరకు వీక్షించవచ్చు.పిక్నిక్ ల కి మరియు ట్రెక్కింగ్ లకి ఈ ప్రాంతం అనువైన ప్రదేశం. అంతే కాకుండా, ఎక్కువ మందిని ఆకట్టుకునే ప్రాంతం. ఈ కొండ పైకి కాలి నడకన వెళ్ళేటప్పుడు దారిలో ఏనుగులను కూడా గమనించవచ్చు. వీచే చల్లని గాలి, పక్షుల కువకువలు మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాయి. కొండపై నిద్రించడానికి కుటీరాలు కూడా అందుబాటులో ఉంటాయి.