తట్టేకాడ్ బర్డ్ సాంచురి లేదా సలీం అలీ బర్డ్ సాంచురి ఎర్నాకుళం జిల్లాలో ఉంది. రక రకాల పక్షులని చూసి ఆనందించాలనుకునే వారికి ఈ సాంచురి అద్భుతమైన సందర్శనానుభూతిని కలిగిస్తుంది. దేశీయ సరీసృపాల కి మరియు జంతువులకి ఈ సాంచురి నివాసం. నవంబర్ నుండి జూన్ నెల ల లో అరుదైన వలస పక్షులు ఈ సాంచురి లో కనువిందు చేస్తాయి. పక్షులని తిలకించేవారు ఈ సమయంలోనే ఇక్కడికి ఎక్కువగా వస్తారు.పెనిన్సులర్ బే ఓల్, మలబార్ గ్రే హార్న్ బిల్, రోజ్ బిల్డ్ రోలర్, క్రిమ్సన్ త్రోటెడ్ బార్బర్, క్రేస్టేడ్ సేర్పెంట్ ఈగల్, గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ మరియు ఫెయిరీ బ్లూ బర్డ్ వంటి అంతరించి పోతున్న ఎన్నో పక్షి జాతులు ఇక్కడ సందర్శకులకి కనువిందు చేస్తాయి.పక్షులతో పాటు, ఇక్కడ ఉన్న టాక్సీడెర్మిక్ మ్యూజియం లో ఏర్పాటు చేసిన జంతువుల పునరావాస కేంద్రాన్ని కూడా సందర్శించవచ్చు. ఈ సాంచురి లో డ్రైవింగ్ నిషేదించబడినది. ఈ ప్రదేశం గురించి మరింత తెలుసుకునేందుకు పర్యాటకులు ఒక గైడ్ ని కూడా నియమించుకునే సదుపాయం కలదు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 6 గంటల వరకు ఈ సాంచురి తెరచి ఉంటుంది.