తోడుపుజా నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం తోడుపుజా. ఈ గ్రామం నుండి 35 కి మీ ల దూరంలో తుంపచి కాల్వేరి సముచయం ఉంది. ప్రకృతి లో ని అందాలని ఆరాధించేవారు వారి పర్యాటక ప్రాంతాల జాబితాలో ఖచ్చితంగా తుంపచి ప్రాంతాన్ని జత చెయ్యాలి. బంధుమిత్రులతో కలిసి వెళ్ళే పిక్నిక్ ల కి ఔటింగ్స్ కి ఈ ప్రాంతం అనువైనది.
ఇడుక్కి జిల్లాలో సందర్శన కి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు షెడ్యూల్ తయారు చేసుకోవాలి. అంతర్గత ప్రశాంతతని పొందేదుకు తోడ్పడే ప్రదేశం. ప్రకృతి నడుమ విశ్రాంతి తీసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి తగిన ప్రదేశం. లాంగ్ వాక్ కి వెళ్ళడం ద్వారా పర్యాటకులు ప్రకృతి లో ని సౌందర్యాన్ని మరింతగా ఆస్వాదించవచ్చు. దగ్గరలోనే ఎన్నో మంచి హోటల్స్ ఉండడం వల్ల వసతి సదుపాయాలకు కొదవలేదు.