Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఇగాత్ పురి

ఇగాత్ పురి - ఒక సమీక్ష

16

ఇగాత్ పురి ఒక ఆసక్తి కలిగించే హాల్ స్టేషన్. ఇది సహ్యాద్రి పర్వత శ్రేణులలో కలదు. ఈ పట్టణం నాసిక్ జిల్లాలో కలదు. మహారాష్ట్రలో ఎన్నో అందమైన హిల్ స్టేషన్లలో ఒకటిగా చెప్పబడుతూ పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తోంది. ఇగాత్ పురి పురాతన మరియు మోటైన దేవాలయాలకు ప్రసిద్ధి.

ఇగాత్ పురి వెళ్ళే వారు ఘటనా దేవి దేవాలయం తప్పక చూడాలి. ఈ దేవాలయంలో మాత ఘటనాదేవి విగ్రహం ఉంటుంది. ఘటనా దేవి అంటే, ఘాట్ లను సంరక్షించే దేవత అని చెపుతారు. ఈ ప్రదేశంనుండి అందమైన ఒక లోయను మరియు సుందరమైన సహ్యాద్రి కొండలలోని కొన్ని శిఖరాలను  కూడా చూడవచ్చు. ఇక్కడకు వచ్చినపుడు విపస్సన కేంద్రం తప్పక చూడండి. ఈ కేంద్రం ధ్యానం గురించి మరియు ఏ ఏ యుగాలలో ధ్యానాన్ని ఎలా చేసేవారు అనే అంశాలపై మీకు చక్కని వివరణ ఇస్తుంది.

మీరు కనుక చరిత్ర, పురాతత్వ శిల్పాల పట్ల ఆసక్తి కలవారైతే, మీ సందర్శన జాబితాలో ట్రింగల్ వాడి కోట తప్పక ఉండి తీరాలి. గంభీరతను ప్రదర్శించే ఈ కోట సముద్ర మట్టానికి సుమారు 3,000 అడుగుల ఎత్తున ఉండి ఒకవైపున అందమైన సహ్యాద్రి శ్రేణులను మరోవైపు ఇగాత్ పురి పట్టణ సౌందర్యాన్ని చూపుతుంది.  కోటలో కల ఆంజనేయ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయుడి ఆశీస్సులు తప్పక పొందండి. ఇక్కడకల వలవాల్కర్ మ్యూజియం విశిష్టత కలది. ఈ మ్యూజియంలో శివాజి మహారాజు జీవిత విశేషాలు మీకు కన్నుల విందుగా అనేకం ప్రదర్శించారు  ఈ ప్రాంతంలో స్ధానికంగా దొరికే ఆహారం వడా పావ్ ఎంతో రుచికరంగా ఉంటుంది. తప్పక తినవలసిన స్ధానిక చిరుతిండి.  

ప్రకృతి అందాలను అతి మనోహరంగా అందించే పట్టణం ఇగాత్ పురి.  

సముద్ర మట్టానికి సుమారు 1900 అడుగుల ఎత్తున కల ఇగాత్ పురి పట్టణం మీకు అద్భుత ప్రకృతి సౌందర్యాన్ని అందిస్తుంది. వంపు సొంపుల జలపాతాలు, పచ్చటి అడవులు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.  మనోహరమైన ఈ పర్వత విహార ప్రదేశం నాగరికతకు దూరంగా ఉంది. స్వచ్ఛమైన గాలి. మనమంతా నగరాలలో అనుభవించే దైనందిన ఒత్తిడి, ఈ ప్రాంత సందర్శనతో పూర్తిగా తొలగిపోతుందనే ఆలోచనతో తరచుగా ఈ ప్రాంత సందర్శనచేసే నగర జీవులు తప్పక అంగీకరిస్తారు.  ట్రింగల్ వాడి సరస్సు ట్రింగల్ వాడి కోటకు సమీపంలో కలదు. కుటుంబ సభ్యులతో కలసి ఆనందించాలంటే, ఇది ఒక అద్భుత ప్రదేశం. ప్రకృతి ప్రేమికులు ఇక్కడి వివిధ జాతుల మొక్కలు, మరియు పక్షులు చూసి ఎంతో ఆనందిస్తారు. ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి కలవారికి ఈ ప్రాంతం ఎన్నో అవకాశాలు ఇస్తుంది.  

ఈ ప్రదేశంలో కల భట్సా నది మరొక పర్యాటక ఆకర్షణ. ఎంతో ప్రశాంతంగా ఉండి మిమ్ములను ఒక్కసారి   మైమరపిస్తుంది.  ఇక్కడకల వైదరణి డ్యామ్ చాలా అందమైన డ్యామ్. ముంబై నగర అవసరాలకు ఈ డ్యామ్ నుండే నీరు సరఫరా అవుతుంది. చూసేందుకు గొప్ప ఆకర్షణ. సాహస క్రీడలైన రివర్ ర్యాఫ్టింగ్, రివర్ క్రాసింగ్ వంటివి చేసేందుకు కేమెల్ వ్యాలీని కూడా చూడవచ్చు.

సామాన్య చర్యలైన నడక లేదా సూర్యాస్తమయం చూడటం వంటివి కూడా చేసి ఈ ప్రదేశ అందాలను ఆస్వాదించవచ్చు. సాహస క్రీడాకారులకు ఈ ప్రదేశం ఎన్నో అవకాశాలు చూపుతుంది.  

ఈ ప్రదేశంలోని మరికొన్ని వాస్తవాలు ఇగాత్ పురి లోప్రధానంగా ఆహ్లాదకరమైన వాతావరణం సంవత్సరం పొడవునా ఉంటుంది. అయితే, వేసవి కాలం మాత్రం కొద్దిపాటి వేడి అనిపిస్తుంది. ఈ సమయంలో పర్యాటకులు తక్కువగా ఉంటారు.వేసవి తర్వాత పడే వర్షాలు ఎంతో హాయి కలిగిస్తాయి.  సరిగ్గా ఈ సమయంలో ఇగాత్ పురి పట్టణం పచ్చదనాన్ని సంతరించుకొని అందమైన జలపాతాలతో మనోహరంగా కనపడుతుంది. ఈ ప్రదేశాన్ని వేడి తక్కువగా ఉండే శీతాకాలంలో సైతం చూసి, ట్రెక్కింగ్ మరియు ఇతర సాహస క్రీడలు ఆచరించి  ఆనందించవచ్చు.

విమానంలో ఈ ప్రదేశం చేరాలనుకునేవారు ముంబైలోని ఛత్రపతి శివాజి విమానాశ్రయం నుండి చేరవచ్చు.119 కి.మీ.ల దూరం ఉంది. నాసిక్ లోని స్ధానిక విమానాశ్రంయం కూడా అనుకూలమే. రైలు ప్రయాణం కోరే వారికి మహారాష్ట్రలోని వివిధ ప్రదేశాలే కాక, దేశంలోని అనేక ప్రాంతాలనుండి ఇక్కడకు చేరవచ్చు. అయితే, స్ధానిక రైళ్ళు కాసర పైన నడిచే అవకాశం లేదు కనుక కాసర నుండి బస్ ప్రయాణం చేయాలి.   

మీ పట్టణంనుండి బస్ లేదా రోడ్డు మార్గం ద్వారా కొండ ప్రాంతాల వెంట ప్రయాణిస్తూ ఈ ప్రదేశం చేరుకోవచ్చు. అనేక మలుపులు కల ఘాట్ రోడ్డు ప్రయాణం మీకు ఒక సవాలుగా ఉంటుంది. అయితే మీకు కలిగే ఆనందం అధికం.  

మీరు చిన్నపాటి వారంతపు సెలవు లేదా కుటుంబ సభ్యులతో అధిక రోజుల విహారం ఏది చేసినప్పటికి మీ ఒత్తిడి పూర్తిగా తొలగి ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని ఈ ప్రదేశ సందర్శన మీకు కలిగిస్తుంది. మరిన్ని రోజులు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఈ ప్రదేశానికి గల ఆకర్షణ అటువంటిది.   

ఇగాత్ పురి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఇగాత్ పురి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఇగాత్ పురి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఇగాత్ పురి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం ఇగాత్ పురి రోడ్డు మార్గంలో ప్రయాణించేవారికి మహారాష్ట్ర ప్రభుత్వ బస్సులు కలవు. ఇవి మహారాష్ట్రలోని వివిధ పట్టణాలనుండి నడుపబడుచున్నాయి. ఇగాత్ పురికి టూరిస్టు బస్సులు కూడా కలవు. బస్ సౌకర్యం బట్టి వీటి ఛార్జీలు రూ.500 లనుండి మారుతూంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం తపోవన్ ఎక్స్ ప్రెస్ ముంబై నుండి ఇగత్ పురి ప్రతిరోజూ నడుస్తుంది. ఇగత్ పురి కి సమీపంలో గల కాసర రైల్వే స్టేషన్ అనేక ప్రధాన ప్రదేశాలకు కలుపబడి ఉండి. ఇక్కడి నుండి ఇగాత్ పురికి అరగంట మాత్రమే క్యాబ్ లో ప్రయాణ సమయంగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం ఇగాత్ పురి పట్టణానికి ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంగా అంటే 119 కి.మీ.ల దూరంలో ఉంటుంది. నాశిక్ లోని గాంధీ నగర్ విమానాశ్రయం 55 కి.మీ. ల దూరంలో ఉండి స్ధానిక విమానాశ్రయంగా సేవలు అందిస్తుంది. రెండు విమానాశ్రయాలు కూడా మహారాష్ట్ర మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు బాగా అనుసంధానించబడి ఉన్నాయి. విమానాశ్రయం నుండి ఇగాత్ పురి చేరాలంటే సుమారు రూ. 2000 వరకు టాక్సీచార్జీలుగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat