ట్రింగల్ వాడి కోట చారిత్రకమైనది మరియు ఒక శిల్పకళ అద్భుతం. సముద్ర మట్టానికి సుమారు 3 వేల అడుగుల ఎత్తున కల ఈ కోట ఇగత్పురి పట్టణాన్ని మనోహరంగా చూపుతుంది. ఈ ప్రదేశం నుండి చూసే పట్టణ దృశ్యం, లోతైన వ్యాలీ, చుట్టుపట్ల అందాలు మిమ్ములను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఈ కోట సాహస ట్రెక్కర్లకు ఎన్నో అవకాశాలనిస్తుంది. కోట పైకి వెళ్ళటం తేలిక పనికాదని గ్రహించాలి. కోటలో కల ఆంజనేయ దేవాలయ సందర్శన మీరు కోటను చేరేటందుకు పడిన శ్రమనంతా తీసివేసినట్లు భావింప చేస్తుంది.