బోరి వైల్డ్ లైఫ్ సంక్చురి దేశం లోనే అతి పురాతన మైన ఫారెస్ట్ రిజర్వు. మధ్య ప్రదేశ్ లోని హోషంగా బాద్ డిస్ట్రిక్ట్ లోని సాత్పురా పర్వత శ్రేణుల మొదటి భాగం లో ఈ సంక్చురి కలదు. దీనిని 1865 లో ఒక వైల్డ్ లైఫ్ సంక్చురి గా 518 చ. కి. మీ. ల విస్తీర్ణం లో ఏర్పరిచారు. దీనికి ఉత్తరం వైపున సాత్పురా నేషనల్ పార్క్, పడమటి భాగంలో తావ నది వుంది ఈ బోరి వైల్డ్ లైఫ్ సంక్చురి ని మరింత వృక్ష, జంతు సంపదలకు నిలయంగా చేసాయి.
ఈ ప్రాంతం అంతా, పచ్చదనం మరియు వెదురు అడవులుచే కప్పబడి వుంటుంది. ఈ సంక్చురి లో వివిధ రకాల జంతువులు, పులులు, చిరుతలు, చీతల్, బైసన్, సాంబార్, చింకార, బార్కింగ్ డీర్ , ఉడుతలు, హయనాలు, నక్కలు వంటి జంతువులు వుంటాయి. ఈ సంక్చురిలో పులులు ప్రధాన ఆకర్షణ. టూరిస్టులకు అనేక సఫారీలు నిర్వహించ బడ తాయి. ఇక్కడ అనేక ఫారెస్ట్ బంగళాలు, గెస్ట్ హౌస్ లు వసతిగా కలవు.