కొతుమ్సర్ గుహలు జగ్దల్పూర్ నుండి షుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు భారతదేశంలో మొట్టమొదటి, ప్రపంచంలో రెండవ అతిపొడవైన సహజ గుహల స్థానాన్ని పొందాయి. ఇది భూగర్భంలో ఉండడం వల్ల, లోపల దట్టమైన చీకటి ఉంటుంది. ఇది స్టాలక్టైట్, స్టాలగ్మైట్ ల నిర్మాణంలో ఉంటుంది. ఇరుకైన మెట్లగుండా ఈ గుహలోకి ప్రవేశించాలి, సందర్శకులు అద్భుతమైన ధ్వనిని కలిగి ఉన్న ప్రధాన హాలులోకి వెళ్ళడానికి పొడవైన, ఇరుకైన గదుల గుండా చేరుకోవచ్చు. దీనిని సంబంధించిన బోలెడన్ని గిరిజన కధలు ఉన్నాయి, వీటిని గుపంపాల్ లేదా కుతంసర్ గుహలు అనికూడా అంటారు.