ఖిం మూ స్నియాంగ్, మేఘాలయ లోని జయంతియా హిల్స్ జిల్లలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంత స్థానిక భాష ప్రకారం “మూ” అంటే రాయి, “స్నియాంగ్” అంటే పంది అని అర్ధం. ఈ ప్రదేశానికి ఇక్కడ ఏర్పాటుచేయబడిన పంది-ఆకారపు రాతి నుండి ఈ పేరు వచ్చింది. ఈ రాయి స్థానికులను రక్షించే శక్తి కలిగిఉందని నమ్మి జయంతియా సంఘం వారు దీనిని పూజిస్తారు.
పర్యాటకులు దేవునికి గౌరవాన్ని అందించడానికి, ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఇష్టపడతారు, స్థానికులకు ఈ దేవుడిపై చాలా నమ్మకం ఉంది. ఇక్కడ జయంతియా హిల్ల లోని స్థానిక నోరూరించే వంటకాల చిన్న రెస్టారెంట్లు, చిన్న కోట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో చేతులతో తయారుచేసే స్థానిక ఉత్పత్తులు అమ్మే, ఎక్కువగా వెదురు, చెక్కతో తయారుచేసిన చిన్న దుకాణాలు కూడా ఉన్నాయి.
షిల్లోంగ్ నుండి బస్సు లేదా టాక్సీలో లేదా యాత్ర కాబ్ లో కూడా జయంతియా హిల్స్ ని తేలికగా చేరుకోవచ్చు.