లూక్సి (కుప్లి) పార్క్, మేఘాలయ లోని జయంతియా హిల్స్ లో లస్కీన్ బ్లాక్ లో లూక్సి గ్రామంలో ఉంది. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పార్క్ అభివృద్ధికి, జిల్లా నిర్వహణ, అటవీ శాఖ ద్వారా పార్కుకు వెళ్ళడానికి ఒక రహదారిని నిర్మించింది. వారు రామ్ గుడారాలను, సందర్సన స్థలాల వద్ద రైలిగ్స్ ని, ప్రజలు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చునే బల్లలను కూడా ఏర్పాటుచేసారు.
అక్కడ పార్కు వద్ద పిల్లలు తమ సమయాన్ని ఆనందంగా గడపడానికి ఆడుకునే స్లైడ్లు, ఉయ్యాలలు ఏర్పాటు చేసారు, ఇవి సందర్శకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. మొత్తానికి, ఇది మీ రద్దీ నగర ప్రపంచం నుండి దూరంగా మీ కుటుంబంతో, స్నేహితులతో కలిసి ప్రసాంత౦గా ఉండడానికి అనువైన ప్రదేశం.
ఇక్కడ కుప్లి నది ఒడ్డుపై వినోదకర్యక్రమాల కేంద్రం కూడా ఉంది. ఇక్కడ స్థానిక NGO లూక్సి సెంటర్ స్కూల్ ఆర్గనైజేషన్ పేరుతో ప్రతిరోజూ బోట్ రేసింగ్, ఈత పోటీలు నిర్వహిస్తున్నారు. షిల్లోంగ్ నుండి యాత్రా కాబ్ లో లూక్సి పార్క్ చేరుకోవడ౦ ఉత్తమం.