ఉమ్హంగ్ సరస్సు, మేఘాలయ లోని జయంతియా హిల్స్ జిల్లలో వతవ్ (బాటోవ్) గ్రామంలో ఉంది. ఉమ్హంగ్ సరస్సు అన్నివైపులా దట్టమైన పచ్చని అడవులతో, చూడడానికి ఎంతో అందంగా, దాని వాతావరణం ఖచ్చితమైన ఏర్పాటుగా ఉంటుంది. చరిత్ర ప్రకారం, ఉ సజర్ నంగ్లి, ఆయన అనుచరులు ఇక్కడ ఉన్న చిన్న నీటి బుగ్గను, ప్రస్తుతం ఈ సరస్సు ఉన్న ప్రదేశాన్ని సందర్శించారు. ఆయన ఈ అందానికి ముగ్ధుడై ఈ నీటి బుగ్గ వద్దే తన అనుచరులతో కలిసి నివసి౦చాలని నిర్ణయించుకుని జయంతియా సామ్రాజ్యంలో అతిపెద్దది, అత్యంత అద్భుతమైన సరస్సుని నిర్మించారు. ఈ గుహవద్ద వారు చాలా నెలలు గడపడం వల్ల ఈ ఉమ్హంగ్ సరస్సు వెలుగులోకి వచ్చింది.
ఉమ్హంగ్ సరస్సు చేరుకోవడానికి, షిల్లోంగ్ నుండి యాత్రా వాహనం బుక్ చేసుకుని, మేఘాలయ లోని పచ్చిక భూములు, అందమైన కొండల నడుమ అద్భుతంగా ప్రయనించండి. ఇక్కడ సెప్టెంబర్ నుండి మే వరకు ఉత్తమ సమయం.