లుమ్శనోంగ్ గ్రామంలో ఉన్న ఉమ్లవాన్ గుహ, ఇది జోవాయ్ తూర్పువైపున 60 కిలోమీటర్ల బైటికి ఉండి, సహసోత్సాహికులకు ఒక ఉత్తేజకరమైన ప్రదేశంగా ఉంది. ఈ గుహ చాలాకాలం ప్రజల ఆశక్తి నుండి మరుగున పడిఉంది, ఇటీవలే ఉపఖండం మొత్తంలో అంత లోతైనది కాకపోయినా అతి పొడవైన గుహగా సరైన సర్వే చేసిన తరువాత ఖచ్చితమైన పేరును సంపాదించుకుంది.
ఉమ్లవాన్ గుహ 21 కిలోమీటర్ల అతిపెద్ద పొడవైన కోట్-సాటి, ఉమస్కోర్ అనే రెండు ఇతర గుహలతో కలిసి ఉంది. ఈ ప్రాంతం కేవలం 60 కిలోమీటర్ల దూరం లోపు అనేక ఇతర గుహలను కూడా కలిగిఉంది, వాటిలో కొన్ని మాత్రమే బహిర్గత మయ్యాయి. స్వంతగా సాహసకృత్యాలను సృష్టించుకోవాలి అనుకునేవారికి ఇది “కేకు పై చెర్రీ” ఒక బోనస్ కావచ్చు.
ఈ గుహను ఎక్కువగా వర్షాకాల సమయంలో గ్రామస్తులు బట్టలు ఉతికే ప్రదేసగా ఉపయోగిస్తారు, గుహల ప్రవేశద్వారం నీటితో నిండి ఉంది, లోపల ఈత కొట్టడానికి వీలుగా ఉంటుంది. ఈ గుహ సహజంగా స్టాలక్టైట్, స్టాలగ్మైట్ రాతి నిర్మాణాలతో అలంకరించబడి ఉంది. ఉమ్లవాన్ గుహ, షిల్లోంగ్ నుండి ప్రైవేట్ కాబ్ బుక్ చేసుకొని రావడానికి అందుబాటులో ఉంటుంది.