Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైపూర్ » ఆకర్షణలు » జయ్ గర్ కోట

జయ్ గర్ కోట, జైపూర్

5

ప్రధాన నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జయ్ గర్ కోట, జైపూర్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ, దీనిని విజయపు కోట అనికూడా అంటారు. గద్దల కొండ పైన ఉన్న అంబర్ కోటకు 400 అడుగుల ఎత్తులో ఈ కోటను నిర్మించారు. దక్షిణం వైపు దుంగార్ దర్వాజా, తూర్పువైపు అవనీ దర్వాజా అనే రెండు ప్రధాన ద్వారాలు ఈ కోటకు ఉన్నాయి. కోటలో ఉన్న సాగర్ తలావ్ కోటలోని నీటి నిల్వకు ప్రధాన వనరు. యుద్ధ అవసరాల కోసం నిర్మించిన ఈ కోట గోడలు 3 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. కోట పైన 50 టన్నుల బరువున్న జైవాన్ అని పిలువబడే పెద్ద ఫిరంగి ఉంది. 8 మీటర్ల పొడవున్న తుపాకీ గొట్టం తో ఉన్న ఈ ఫిరంగిని ప్రపంచంలోని అతిపెద్ద కదిలే ఫిరంగులలో ఒకటిగా పరిగణిస్తారు. ఏడంతస్తుల నిర్మాణంతో ఉండే దియా బుర్జ్ అనే ఎత్తైన కేంద్రం నుంచి నగరం మొత్తాన్నీ విహంగ వీక్షణ౦గా చూడవచ్చు. ఈ కోటలో పెద్ద నిధి దాచబడి ఉందని ఒక పుకారు ఉంది. ఈ కోటలో ఉన్న మ్యూజియంలో పురాతన నాణాలు, ఫిరంగులు, తోలుబొమ్మలు ప్రదర్శిస్తున్నారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri