ఖాభా, జైసల్మేర్ నగరం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న కుగ్రామం. ఖాభా కోట, జియోలాజికల్ మ్యూజియం ఈ గ్రామ ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఇక్కడకు వచ్చే పర్యాటకులు రాజస్తాన్ విలక్షణ గ్రామీణ జీవనశైలిని చూడవచ్చు. ఇక్కడ టెంట్లు, కుటీరాలు, శిబారాల రూపంలో వసతులు అందుబాటులో ఉన్నాయి.