Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైసల్మేర్ » వాతావరణం

జైసల్మేర్ వాతావరణం

ప్రయాణానికి సరైన సమయం: జైసల్మేర్ లో ఫిబ్రవరి నెలలో సుప్రసిద్ధ ఎడారి పండుగ నిర్వహిస్తారు. సెప్టెంబర్ నెలలో ప్రసిద్ది చెందిన రామ దేవరా ఉత్సవం చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి అనేకమంది పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు. అక్టోబర్ నుండి మార్చ్ నెలల మధ్య శెలవులలో జైసల్మేర్ వెళ్ళడానికి ఉత్తమ సమయం.

వేసవి

థార్ ఎడారి నడుమన ఉండడంతో జైసల్మేరు సంవత్సరం పొడవునా వేడిగా, పొడిగా ఉంటుంది. వేసవి (మార్చ్ నుండి మే వరకు): వేసవి కలం మార్చ్ నెలలో ప్రారంభమై మే వరకు ఉంటుంది. ఇక్కడి గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 45.6c, 25c గా నమోదు చేయబడతాయి. వేసవిలో ఇక్కడి వాతావరణం చాలా వేడిగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్ వరకు): వర్షాకాలంలో జైసల్మేర్ ప్రాంతంలో తక్కువ వర్షపాతం ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ సంవత్సరంలో సగటు వర్షపాతం 15 సెంటీమీటర్లు గా నమోదవుతుంది.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు): శీతాకాలం లో జైసల్మేర్ లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 23.6c, 4.9c గా నమోదవుతాయి.