వండర్ ల్యాండ్ థీం పార్క్ డాబా ప్రాంతంలో కలదు. ఇది తప్పక చూడవలసిన పర్యాటక ఆకర్షణ. ఇది దేశంలోని ప్రసిద్ధ అమూజ్ మెంట్ పార్క్ లలో ఒకటి. అన్ని వయసుల వారూ ఆనందిస్తారు. అనేక వినోద అంశాలతో టూరిస్ట్ లను ఆకర్షిస్తుంది. ఈ పార్క్ లో కల హర్రర్ హౌస్ ఒక ప్రత్యేక ఆకర్షణ.
వాటర్ పార్క్ బే సైడ్, వేవ్ పూల్, వండర్ ఫాల్ , ఇండోర్ ఆక్వా డాన్స్, జైంట్ మరియు స్పీడ్ స్లయిడ్ వంటివి కలవు. పచ్చటి లాన్ మరియు ఒక గిఫ్ట్ స్టోర్ కూడా కలవు.