జంజ్గిర్ వచ్చే సందర్శకులకు దేవరఘట ఒక ఆదర్శ విహారయాత్ర ప్రాంతం కావచ్చు. ఇది మహానది, లిలాగర్, శివనాథ్ అనే మూడు నదులు కలిసే అందమైన స్థలం. సందర్శకులు ఈ ప్రాంతానికి తమ కుటుంబం, స్నేహితులతో వచ్చి ఇక్కడి సుందర ప్రకృతి దృశ్యాలను చూసి ఆనందించవచ్చు. ఫోటోగ్రఫి ప్రియులు దేవరఘటను మళ్ళీ మళ్ళీ సందర్శిస్తారనడంలో ఎటువంటి అనుమానం లేదు.