బౌద్ధ గుహలు,స్థూపాలు, ఝలావర్ ప్రధాన ఆకర్షణలు. కొల్వి గ్రామం నుండి వెలికితీయబడిన పురాతన రాతి గుహలు గణనీయమైన పురావస్తు, చారిత్రిక ప్రాధాన్య౦ కలిగి ఉన్నాయి. ఈ గ్రామం ఝలావర్ నగరం నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. బృహదాకారంలో వున్న బుద్ధుడు, స్థూపాలపై ఉన్న అందమైన చేక్కుళ్ళు ఈ గుహలకు మరింత శోభనిచ్చాయి. ఈ ప్రాంతంలోని స్థానికులలో బౌద్ధ సంస్కృతిని సులభంగా గుర్తించవచ్చు.