Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఝాన్సీ » వాతావరణం

ఝాన్సీ వాతావరణం

ఉత్తర భారత దేశం లో ని మిగతా ప్రదేశాల లాగానే ఝాన్సీ ని సందర్శించేందుకు నవంబర్ నుండి మార్చ్ వరకు ఉత్తమ సమయం. మిగతా నెలలలో ఇక్కడ పొడి గా వేడి గా ఉంటుంది. ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలలో వారం పాటు జరిగే ఝాన్సీ ఫెస్టివల్ లో పాల్గొనడానికి అత్యధిక మంది సందర్శకులు ఈ ప్రాంతానికి విచ్చేస్తారు.

వేసవి

వేసవి కాలం మార్చ్ నుండి మే వరకు ఇక్కడ వేసవి కాలం. 22°C నుండి 40°C ల మధ్య వేసవి కాలం లో ఇక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మే నెల అత్యంత వేడిగా ఉంటుంది. వేడి గాలులతో వాతావరణం అసౌకర్యం గా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షాకాలం. ఈ సమయం లో నిరంతరాయం గా వర్షపాతం నమోదవుతుంది. మబ్బులు పట్టిన ఆకాశం తో వాతావరణం తేమ గా తడి తడి గా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్కడ శీతాకాలం. ఈ సమయం లో వాతావరణం ఆహ్లాదకరం గా ఉంటుంది. ఉష్ణోగ్రత 12°C నుండి 20°C వరకు నమోదవుతుంది.