ఘర్ ఆలి జోర్హాట్ లోని చారిత్రిక ప్రదేశం, అలాగే అహోం సంస్కృతికి చెందిన స్మారకాలు కొనడానికి వీలయ్యే ప్రాంతం. అహోం రాజులు మోమారియాలతో యుద్ధం చేసేటప్పుడు అహోం పాలన సాగిన కాలం లో ఘర్ ఆలి నిర్మించారు. సియోనీ ఆలి నుంచి నాహా పర్వతాల దాకా విస్తరించే పెద్ద ఆనకట్ట ఘర్ ఆలి. అహోం రాజ్యాన్ని బాహ్య ప్రమాదాల నుంచి రక్షించడానికి ఈ ఆనకట్టను నిర్మించారు.
ఈ చారిత్రిక కేంద్రానికి అనేక గందరగోళం చేసే దారులు వుండడం వల్ల ఘర్ ఆలి ని బిబుద్ది ఘర్ అని కూడా పిలుస్తారు. మోమారియా రాజులు జోర్హాట్ ను ముట్టడించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఈ ఆనకట్టను చూడగానే మాత్రి భ్రమించింది – అందువల్ల ఈ ప్రాంతానికి బిబుద్ది ఘర్ అనే పేరు వచ్చింది.
ఇప్పుడు ఘర్ ఆలీ జోర్హాట్ కు ప్రధాన వ్యాపార కేంద్రంగా వుంది. ఇక్కడి దుకాణాల్లో అహోం రాజుల కాలపు ఆసక్తికరమైన స్మారకాలు దొరుకుతాయి. ఘర్ ఆలి ని వాణిజ్య కేంద్రంగా మార్చే ఇరుకైన సన్నని వీధులు చూసి తీరాల్సిందే.