ఆది-కడి వావ్ మరియు నవ్ఘన్ కువో అనే రెండు అడుగు బావులు ఉపర్కొట్ లోపల ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా సందర్శించండి. ఇతర అడుగు బావులు మాదిరిగా కాకుండా, ఈ అడుగు బావులను ఏక రాళ్ళతో తయారు చేస్తారు మరియు మరే ఇతర బాహ్య మూలకాలను వాటిని నిర్మించడానికి ఉపయోగించలేదు.
ఆది-కడి వావ్ 9 పొరలు గల ఒక లోతైన బావి.అలాగే ఈ బావి అడుగును 15 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ బావికి ఆ పేరు రావటానికి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉన్నది.రాజు బావి త్రవ్వటానికి అదేశించేను . బావిని లోతుగా త్రవ్విన తర్వాత నీటిని గుర్తించినప్పుడు, రాచరిక పూజారి ఇద్దరు పెళ్లి కాని అమ్మాయిలు బలిదానం తర్వాతే నీటిని చూడాలని ప్రకటించెను.ఆది మరియు కడి అనే ఇద్దరు దురదృష్టకరమైన అమ్మాయిలను ఎంపిక చేసారు.ఆ తర్వాత పూజారి చెప్పినట్లు గానే వారి త్యాగం తర్వాత నీటిని కనుగొన్నారు.ఆది మరియు కడి బావి నుండి క్రమం తప్పకుండా నీటిని ఉపయోగించేవారు. ఈ స్థలం సందర్శించిన వారికి వారి స్మృత్యర్థం దగ్గరలో చెట్టు మీద వస్త్రం మరియు గాజులు వేలాడదీసి ఉండటం కనిపిస్తుంది.