శివనేరి కోట జున్నార్ సమీపంలో కలదు. ఇది మరాఠా మహరాజు శివాజీ మహారాజు జన్మస్ధలం. ఈ కోటలో శివాజీ 1630 లో జన్మించాడు. ఇక్కడ జన్మించటమే కాదు, ఈ కోటలో ఒక సైనికుడిగా శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ కోటలోకి ప్రవేశించాలంటే, సుమారు ఏడు గేట్లు దాటి వెళ్ళటం పర్యాటకులకు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ కోటలో మధ్యగా బాదామి తాలాబ్ అనే చిన్న చెరువు కూడా కనపడుతుంది. శివాజీ తల్లి జీజాబాయి విగ్రహం మరియు శివాజీ విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు. కోట సమీపంలోనే ఒక దేవాలయం కూడా ఉంది. దీని ప్రధాన దైవం శివని దేవత. ఈ ప్రదేశానికి వచ్చే వారు ఈ దేవాలయాన్ని తప్పక సందర్శించాలి.