Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కడప » వాతావరణం

కడప వాతావరణం

ఉత్తమ సమయం అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అలాగే ఫెబ్రవరి మాసాల లో కడప ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఈ మాసాలలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయం లో ఈ ప్రాంతాన్ని సందర్శించడం వల్ల కలిగే అనుభూతి అనిర్వచనీయం. ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. సాయంత్రాలు అలాగే రాత్రులు కొంచెం చలిగా ఉండవచ్చు. అందువల్ల ఊలి వస్త్రాలు తీసుకెళ్లడం మరచిపోకూడదు.

వేసవి

ఎండాకాలం ఎండాకాలం లో కడప జిల్లాలో తీవ్రమయిన ఎండలు ఉంటాయి. ఎండాకాలంలో 32 నుండి 37డిగ్రీల సెల్సియస్ వరకు ఇక్కడ ఉష్ణోగ్రత నమోదవుతుంది. మార్చ్ నెల లో ప్రారంభమయ్యే ఇక్కడి ఎండలు జూన్ నెల వరకు కొనసాగుతాయి. మే మరియ జూన్ నెలలో ఇక్కడ తీవ్రమయిన ఎండలు తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. ఎండాకాలం లో ఎండలు తీవ్రంగా ఉండడమే కాకుండా, వాతావరణం పొడిగా, కొంచెం తేమ తో ప్రయాణాన్ని కష్టతరం చేస్తాయి.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ నెల చివరలో ప్రారంభమయ్యే వర్షాకాలం జూలై, ఆగష్టు అలాగే సెప్టెంబర్ నెల మొత్తం కొనసాగుతుంది. ఉష్ణ వాతావరణం కలగడం వలన ఈ ప్రాంతంలో అక్టోబర్ మరియు నవంబర్ నెల ల లో కూడా తేలిక పాటి జల్లులు కురవవచ్చు. మాములుగా వర్షాకాలంలో సాధారణం నుండి భారీ వర్షపాతాలు నమోదవవచ్చు. ఉష్ణోగ్రత తగ్గి తెమ శాతం పెరుగుతుడ్ని. కదపని సందర్శించేందుకు వర్షాకాలం ఉత్తమ సమయం కాదు.

చలికాలం

శీతాకాలం ఉష్ణమండల ప్రాంతం కావడం వల్ల ఇక్కడ శీతాకాలం ప్రభావం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ఉదయం పూట ఎండ వెచ్చగా ఉంటుంది కానీ ఇబ్బంది పెట్టేంత వేడి ఉండదు. మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళడానికి అనువుగా ఉంటాయి. సాయంత్రం అలాగే రాత్రి పూట వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి అలాగే ఫిబ్రవరి మాసాల్లో ఇక్కడ శీతాకాలం. ఉష్ణోగ్రత తగ్గి గాలి లో తేమ శాతం పెరుగుతుంది.